Special Audit Plan: భద్రతా తనిఖీల కోసం ప్రత్యేక ఆడిట్ ప్లాన్ ప్రారంభించిన DGCA
ABN , Publish Date - Jun 23 , 2025 | 11:45 AM
భారత వాయు రవాణా రంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా స్పెషల్ ఆడిట్ కార్యక్రమాన్ని (Special Audit Plan) ప్రారంభించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
భారతదేశంలో వాయు రవాణా వ్యవస్థను సమగ్రంగా అంచనా వేసేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కొత్తగా స్పెషల్ ఆడిట్ కార్యక్రమాన్ని (Special Audit Plan) ప్రారంభించింది. ఈ కొత్త ఆడిట్ విధానంతో వాయు రవాణా రంగం అన్ని శాఖలను సమగ్రంగా పరిశీలించనుంది. దీంతోపాటు ఇలాంటి ఆడిట్‌లు కేవలం విమానాలు నడపగలిగే పనితీరును మాత్రమే కాకుండా, విమానాశ్రయాల మెయింటనెన్స్, శిక్షణ సంస్థలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీల పనితీరును కూడా చెక్ చేయనున్నాయి.
విభాగాల మధ్య
ప్రస్తుతం భారతదేశంలోని వాయు రవాణా పరిశ్రమలో భద్రతా పరిశీలనలు ఎక్కువగా విభాగాల మధ్య బిడ్ పద్ధతుల్లో జరుగుతాయి. DGCA వివిధ విభాగాల నుంచి చేసిన పర్యవేక్షణలు మాత్రమే చేసేవిగా ఉంటాయి. ఉదాహరణకు ఎయిర్ లైన్స్ విషయంలో భద్రతా తనిఖీలు, విమానాశ్రయాలలోని భద్రత, విమానాల లోడ్ ఆపరేషన్స్ మొదలైనవి ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ విధానంలో ప్రతీ అంశం కూడా ఒక్కో విభాగం కింద చేసేవిగా ఉంటాయి.
సమగ్ర తనిఖీ
ఈ కొత్త స్పెషల్ ఆడిట్ విధానం ఆయా విభాగాలను విడివిడిగా చూసే బదులు, వాటిని సమగ్రంగా చూసే కార్యక్రమాన్ని రూపొందించింది. ఇటీవల అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 విమానం ఆకస్మికంగా క్రాష్ అయ్యింది. ఈ ఘటన తర్వాత భద్రతా వ్యవస్థలో కొన్ని లొపాలు, మార్పుల అవసరాన్ని ప్రస్తావించింది. దీంతో, DGCA ఈ కొత్త ఆడిట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం ప్రత్యేక మల్టీడిసిప్లినరీ జట్లు ఏకతాటిపై పనిచేస్తాయి. ఈ జట్లలో DGCA నుంచి వివిధ విభాగాల అధికారులు ఉంటారు. ఉదాహరణకు ఫ్లైట్ స్టాండర్డ్స్, ఎయిర్ సేఫ్టీ, ఎయిర్ వర్ధనెస్, ఎరోడ్రోమ్ స్టాండర్డ్స్, ఎయిర్ నావిగేషన్ వంటి విభాగాలు ఉంటాయి. అవసరమైతే, బయటి నిపుణుల సహాయం కూడా తీసుకుంటారు.
కొత్త ఆడిట్ విధానంలో మూడు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి
భద్రతా నిర్వహణ వ్యవస్థ (SMS): ఎప్పటికప్పుడు ఉండే ఆపరేషన్ల భద్రతా నిర్వహణ విధానాలను పరిక్షించడం
ఆపరేషనల్ ప్రాక్టీసెస్ స్థితి: ఆపరేషన్ల సరళతను, పరిశ్రమలలో అనుసరించే పద్ధతులు, వాటి సమర్థతను పరిశీలించడం
నియమాలకు అనుగుణంగా ఉండటం: అన్ని పరిరక్షణలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటాయి
ఈ ఆడిట్లు వివిధ విధానాలను పాటిస్తాయి. వాటిలో ఒక్కో సైట్ లో తనిఖీలు, డాక్యుమెంట్ సమీక్షలు, ఉద్యోగులతో ఇంటర్వ్యూ, భద్రతా డేటా విశ్లేషణ, శిక్షణ రికార్డుల పరిశీలన మొదలైన వాటిని పరిగణలోకి తీసుకుంటారు.
ఆడిట్ ప్రక్రియ
ఈ ప్రత్యేక ఆడిట్లు సాధారణ సంవత్సర పర్యవేక్షణ ధోరణుల కన్నా మరింత ప్రగతిశీలంగా ఉంటాయి. విమానాలు, విమానాశ్రయాలు మాత్రమే కాకుండా, మెంటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (MRO) సేవలు, శిక్షణ అకాడమీలు, అత్యవసర స్పందన వ్యవస్థలు, సరఫరా వంటి విభాగాలన్నింటినీ సమగ్రంగా ఆడిట్ చేస్తాయి. ఈ ఆడిట్లు సాధారణంగా వార్షిక పర్యవేక్షణ లేదా ఆపరేషన్ తర్వాత సమీక్ష మాదిరిగా ఉంటాయి. కానీ కొన్ని ఘటనలు, ఉల్లంఘనలు లేదా ICAO (ఇంటర్నేషనల్ సివిల్ అవియేషన్ ఆర్గనైజేషన్) దృష్టిలోకి వచ్చిన అంశాల ఆధారంగా అనుకోని సమయంలో కూడా ఆడిట్‌లు నిర్వహించే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:
జూలై 2025లో బ్యాంకు సెలవులు.. ఇదే పూర్తి లిస్ట్..
1600 కోట్ల పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్.. హెచ్చరించిన గూగుల్
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి