Heavy Rain: టెక్సాస్‌లో వరద బీభత్సం.. 27 మంది మృతి
ABN , Publish Date - Jul 06 , 2025 | 02:38 AM
కొన్ని నెలల పాటు కురవాల్సిన వర్షం కొన్ని గంటల్లో కుండపోతగా కురవడంతో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆకస్మిక వరదలు సంభవించాయి.
కెర్విల్, జూలై 5: కొన్ని నెలల పాటు కురవాల్సిన వర్షం కొన్ని గంటల్లో కుండపోతగా కురవడంతో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల్లో 27మంది దుర్మరణం పాలవగా.. మరో 23మందికిపైగా బాలికల ఆచూకీ గల్లంతయింది. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కెర్ కౌంటీలో శుక్రవారం రాత్రి ఏకదాటిగా 25 సెంటీమీటర్ల వర్షం కురవడంతో హంట్ ప్రాంతంలోని గ్వాదలూప్ నది ఉగ్రరూపం దాల్చింది.