Viral Video: మీరు గొడవపడ్డానికి మెట్రో రైలే దొరికిందా మహా తల్లులు..
ABN , Publish Date - Mar 18 , 2025 | 03:02 PM
ఢిల్లీ మెట్రోలో ఇద్దరు ఆడవాళ్ల మధ్య యుద్ధం జరిగింది. అందరి ముందు వాళ్లు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు విడిపించడానికి ఎంత ప్రయాణించినా వాళ్లు మాత్రం ఆగలేదు.
ఈ మధ్య కాలంలో జనాలకు ఓపిక బాగా తగ్గిపోయింది. కొంతమంది ప్రతీ చిన్న విషయానికి అనవసరమైన దానికంటే ఎక్కువగా స్పందిస్తూ ఉన్నారు. గొడవలు పెట్టుకుంటున్నారు. మగవాళ్ల సంగతి పక్కన పెడితే ఆడవాళ్లు కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తాజాగా, ఢిల్లీ మెట్రో రైలులో ఓ ఇద్దరు ఆడవాళ్ల మధ్య గొడవ జరిగింది. అందరి ముందు జట్లు పట్టుకుని కొట్టుకున్నారు. వారిని విడిపించడానికి తోటి ప్రయాణికులు తెగ శ్రమించాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఓ ఇద్దరు ఆడవాళ్లు ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణిస్తూ ఉన్నారు. మెట్రో రైలులోని లేడీస్ కోచ్‌లో వారు ప్రయాణిస్తూ ఉన్నారు. కొద్ది సేపటి ఓ మహిళ మరో మహిళపై పడింది. దీంతో గొడవ మొదలైంది.
ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలి వానలా అయింది. ఇద్దరూ ఒకరి జట్టు ఒకరు పట్టుకుని కొట్టుకున్నారు. ఆ తర్వాత రెడ్ డ్రెస్ ధరించిన మహిళ బ్లూ కలర్ డ్రెస్ ధరించిన మహిళ జట్టు పట్టుకుని లాగుతూ ఉంది. పక్కన ఉన్న వాళ్లు విడిపించడానికి ఎంత ప్రయత్నించినా ఆమె వదిలిపెట్టలేదు. కొద్ది సేపటి తర్వాత బ్లూ డ్రెస్ ఆమె .. రెడ్ డ్రెస్ మహిళనుంచి తప్పించుకుంది. వెంటనే ప్రత్యర్థి మహిళ జట్టుపట్టుకుంది. అటు, ఇటు లాగిపడేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై మిశ్రమ స్పందన వస్తోంది. ‘ ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు ఫ్రీ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది’..‘ అది ఢిల్లీ మెట్రో కాదు... ఓ ఫైట్ క్లబ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్..
ఢిల్లీ మెట్రో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. తరచుగా ఏదో ఒక గొడవతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఢిల్లీ మెట్రోలో మహిళలు గొడవ పడటం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు గొడవలు జరిగాయి. ఇక, ప్రేమికులు మెట్రోలో రెచ్చిపోయి ప్రవర్తిస్తుంటారు. ప్రతీ నిత్యం ఏదో ఒక వింత సంఘటన జరుగుతూనే ఉంటుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. నిజం చెప్పాలంటే .. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించే వారికి ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎలాంటి కొరత ఉండదు. ఈ విషయాన్ని జనాలే స్వయంగా చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీ కళ్ల సత్తాను తేల్చే పజిల్ ఇది.. ఈ అడవిలోని జిరాఫీని 5 సెకెన్లలో కనుక్కోండి..
Lion Viral Video: సింహం పిల్ల చిలిపి పని.. ఉలిక్కి పడిన మృగరాజులు.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..