Share News

Delhi MCD Elections: ఢిల్లీ ఎంసీడీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు నోటిఫికేషన్

ABN , Publish Date - Apr 11 , 2025 | 08:26 PM

ఆమ్ ఆద్మీ పార్టీ 2022 డిసెంబర్‌లో ఎంసీడీని గెలుచుకుంది. బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించింది. అయితే, బీజేపీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఎంసీడీ పోల్స్‌ను కూడా స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది.

Delhi MCD Elections: ఢిల్లీ ఎంసీడీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు నోటిఫికేషన్

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు (Mayor, Deputy Mayor Elections) ఏప్రిల్ 25న జరుగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు గడువు ఏప్రిల్ 21వ తేదీతో ముగుస్తుంది. 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఎంసీడీ సమావేశంలో ఎన్నికలు జరుగనున్నట్టు ఎంసీడీ శుక్రవారంనాడు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి మహేష్ కుమార్ ఖిచి మూడు ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి కిషన్ లాల్‌పై గెలిచారు. ఖిచికి 133 ఓట్లు రాగా, లాల్ 130 ఓట్లు సాధించారు. రెండు ఓట్లు చెల్లలేదు.

Tamilnadu Asssmbly Election 2026: అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు.. అమిత్‌షా బిగ్ స్టేట్‌మెంట్

ఢిల్లీలో మేయర్ పదవి ఐదు-సింగిల్ ఇయర్ టర్మ్‌ ప్రాతిపదికగా రొటేషనల్ పద్ధతిలో ఉంటుంది. తొలి సంవత్సరం మహిళలకు, రెండో సంవత్సరం ఓపెన్ కేటగిరి, మూడో సంవత్సరం రిజర్వ్‌డ్ కేటగిరి, తక్కిన రెండేళ్లు ఓపెన్ కెటగిరీకి కేటాయిస్తారు. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కొత్త మేయర్ ఎంపిక ఉంటుంది.

ఆమ్ ఆద్మీ పార్టీ 2022 డిసెంబర్‌లో ఎంసీడీని గెలుచుకుంది. బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించింది. అయితే, బీజేపీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఎంసీడీ పోల్స్‌ను కూడా స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది.

ఇవి కూడా చదవండి..

Nainar Nagendran: తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడుగా నైనార్ నాగేంద్రన్

Tahawwur Rana-Modi: తహవూర్ రాణా అప్పగింత.. మోదీ పాత ట్వీట్ వైరల్

Custody: తహవ్వుర్‌ రాణాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీన్ఐఏ కస్టడీ

Updated Date - Apr 11 , 2025 | 08:27 PM