Severe Air Pollution in Delhi: ఢిల్లీలో భారీగా వాయు కాలుష్యం.. గ్రాఫ్ 2 అమలు చేసిన ప్రభుత్వం
ABN , Publish Date - Oct 20 , 2025 | 09:13 AM
దీపావళి పండుగ వేళ ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీంతో అక్కడి ప్రభుత్వం గ్రాఫ్ 2 అమలు చేసింది. దీపావళికి ముందు కాలుష్య స్థాయిలు పెరగడంతో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో GRAP స్టేజ్-II ఆంక్షలు సర్కార్ విధించింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) దేశ రాజధాని, దాని ప్రక్కనే ఉన్న NCR ప్రాంతంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) యొక్క రెండవ దశను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 20: దీపావళి పండుగ వేళ ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీంతో అక్కడి ప్రభుత్వం గ్రాఫ్ 2 అమలు చేసింది. దీపావళికి ముందు కాలుష్య స్థాయిలు పెరగడంతో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో GRAP స్టేజ్-II ఆంక్షలు సర్కార్ విధించింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) దేశ రాజధాని, దాని ప్రక్కనే ఉన్న NCR ప్రాంతంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) యొక్క రెండవ దశను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. నగరంలోని వాహనాల నుంచి వచ్చే పొగతో పాటు శీతాకాలంలో చలి బాగా పెరగడంతో కాలుష్యం పెరుగుదల తీవ్రమైనట్లు అధికారులు వెల్లడించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయులు తీవ్రమైన జోన్‌లోకి ప్రవేశిస్తున్నందున నియంత్రణ చర్యలను వేగవంతం చేస్తున్నామని వివరించారు.
ఢిల్లీలో వాయు కాలుష్యంతో ఎయిర్ క్వాలిటీ (Severe Air Pollution in Delhi) మరింత తగ్గిపోయింది. రోజురోజుకి క్షీణిస్తుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అనేక ప్రాంతాల్లో 280కి పైగా అధ్వాన్నంగా ఉంది. అత్యంత అధ్వాన్న స్థితి కేటగిరీలోకి ఈ ఇండెక్స్ వస్తుంది. అక్షరధామ్ ప్రాంతంలో అయితే వాయు నాణ్యత ఏకంగా 426గా ఉంది. ఈ సీజన్‌లో ఢిల్లీలో ఇదే అత్యధిక కాలుష్య స్థాయి అని సీపీసీబీ వెల్లడించింది. ఆనంద్ విహార్ ప్రాంతం 418 ఏక్యూఐతో తర్వాతి స్థానంలో ఉంది. వాయు కాలుష్యం పెరగడంతో ముఖ్యంగా ఆస్తమా, అలర్జీతో బాధపడుతున్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇన్ హలార్ ఎప్పటికప్పుడు దగ్గర ఉంచుకోవాలని సూచిస్తున్నారు. సమయానికి టాబ్లెట్‌లు వేసుకోవాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
President Diwali Wishes: భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు
Festival Special Trains: పండుగ ప్రయాణికుల కోసం నార్త్ రైల్వే 17 ప్రత్యేక రైళ్లు