Delhi High Court: రూ.20 వాటర్ బాటిల్‌కు 100 ఎందుకు తీసుకుంటారు
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:55 AM
హోటళ్లు, రెస్టారెంట్లు వసూలు చేస్తున్న సర్వీస్ చార్జీలపై మరోసారి ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ..
హోటళ్లు, రెస్టారెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ, ఆగస్టు 24: హోటళ్లు, రెస్టారెంట్లు వసూలు చేస్తున్న సర్వీస్ చార్జీలపై మరోసారి ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విక్రయించే వాటి పై గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ) కంటే ఎక్కువే తీసుకుంటున్నప్పుడు.. మళ్లీ అదనంగా సర్వీస్ చార్జీ ఎందుకు వసూలు చేస్తున్నారంటూ రెస్టారెంట్ల సం ఘాలను నిలదీసింది. హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీ తప్పనిసరి కాదంటూ ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ జాతీయ రెస్టారెంట్ల సంఘం, భారత హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాల సమాఖ్య పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ద్విసభ్య ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ‘రూ.20 వాటర్ బా టిల్‌కు రూ.100 వసూలు చేస్తున్నప్పుడు మళ్లీ విని యోగదారుడు విడిగా సర్వీస్ చార్జీ ఎందుకు చెల్లిం చాలి. ఎమ్మార్పీ కంటే ఎక్కువ తీసుకుంటారా.. అద నంగా రూ.80 ఎందుకివ్వాలి..?’ అని రెస్టారెంట్ల సం ఘాలను ప్రశ్నించింది. వాదనలు నమోదు చేసుకున్న కోర్టు.. విచారణను సెప్టెంబరు 22కి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News