Share News

Delhi Election Results: ఉదయం 8 గంటలకే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

ABN , Publish Date - Feb 07 , 2025 | 10:28 PM

Delhi Election Results: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. ఉదయం 8.00 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలో నమోదు అయిన ఓట్లను లెక్కిస్తారు.

Delhi Election Results: ఉదయం 8 గంటలకే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 07: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు రిటర్నింగ్ అధికారిని ఎన్నికల సంఘం నియమించింది. అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. అదే విధంగా సీసీ కెమెరాల నిఘాలో ఈ ఓట్లు లెక్కింపు ప్రక్రియ మొత్తం కొనసాగనుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి భద్రత సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ ఏజెంట్లను మాత్రమే అనుమతి ఇస్తారు.

అయితే ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు వారిని బయటకు అనుమతించరు. ఇక ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లను ఉదయం 7 గంటలకు తెరవనున్నారు. అదీ కూడ ఆ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల సమక్షంలో మాత్రమే ఈ స్ట్రాంగ్ రూమ్ లను రిటర్నింగ్ అధికారి తెరవనున్నారు. అనంతరం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఆ క్రమంలో తొలుత పోస్టల్ బ్యాలెట్స్ ను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలో నమోదు అయిన ఓట్లను లెక్కిస్తారు. ఢిల్లీ అధికార పీఠాన్ని ఎవరు కైవసం చేసుకంటారనేది ఫిబ్రవరి 8వ తేదీ మధ్యాహ్నానానికి తెలిసి పోనుంది.


ఫిబ్రవరి 5వ తేదీన న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు బీజేపీ, ఆప్ మధ్య జరగనుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం బీజేపీనే అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని సర్వేలు స్పష్టం చేశాయి. ఇక కేకే సర్వే మాత్రం మళ్లీ వరుసగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకొంటుందని పేర్కొంది. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఢిల్లీ ఓటర్లు పట్టం కట్టారనేది శనివారం మధ్యాహ్నానానికి తెలియనుంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. అధికారాన్ని అందుకోవాలంటే మాత్రం 36 స్థానాలు రావాల్సి ఉంది.

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: కేటీఆర్‍కు మరో అరుదైన గౌరవం

Also Read: జగన్‍కి ఊహించని షాక్.. ఆ ఐదుగురు జంప్ !

Also Read: ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆలపాటి రాజేంద్రప్రసాద్ నామినేషన్... పాల్గొన్న మన్నవ మోహన కృష్ణ

Also Read: పిస్తా వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

Also Read: కేబినెట్‍పై కాదు కార్యవర్గంపై కసరత్తు

Also Read: 100 మంది అమ్మాయిలు.. రూ.333 కోట్లు.. బత్తుల టార్గెట్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

Also Read: శంషాబాద్ ఎయిర్‍పోర్ట్ లో సెలబ్రటీస్ వెయిటింగ్

Also Read: పుడ్ పాయిజనింగ్.. పలువురు విద్యార్థులకు అస్వస్థత

For National News And Telugu News

Updated Date - Feb 07 , 2025 | 10:28 PM