Delhi election Results: ఫిరాయించి పగ తీర్చుకున్నారు.. ఆ 8 నియోజక వర్గాలు బీజేపీకి ఎలా దక్కాయంటే..
ABN , Publish Date - Feb 08 , 2025 | 06:03 PM
ఢిల్లీలో పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంతో పాటు కార్యకర్తలు కూడా చెమటోడ్చి పని చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని విభేదాలు కూడా రచ్చ కెక్కి ఓటమికి కారణమయ్యాయి.

దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 26 ఏళ్ల తర్వాత బీజేపీ అధికార పీఠం దక్కించుకుంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంతో పాటు కార్యకర్తలు కూడా చెమటోడ్చి పని చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని విభేదాలు కూడా రచ్చ కెక్కి ఓటమికి కారణమయ్యాయి. గతేడాది ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం రేకెత్తించాయి. అలాగే ఆప్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీ విజయం కూడా పని చేశారు. దీంతో ఆ మొత్తం 8 నియోజక వర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థులే గెలుపొందారు.
ఢిల్లీలో పాలం, త్రిలోక్‌పురి, మదిపుర్, కస్తూర్బా నగర్, ఉత్తమ్ నగర్, బిజ్వాసన్, మెహ్రౌలీ, ఆదర్శ్ నగర్ అసెంబ్లీ స్థానాలను 2020 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. అయితే తాజా ఎన్నికల్లో ఆప్ పార్టీ అధినాయకత్వం ఈ 8 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. మొత్తం 8 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టింది. దీంతో ఆ ఎనిమిది మంది ఆప్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. బీజేపీ వారిలో ఒక్కరికీ సీటు ఇవ్వలేదు. కానీ, వారి సేవలను వినియోగించుకుంది. దీంతో తాజా ఎన్నికల్లో ఆ 8 నియోజకవర్గాల్లోనూ బీజేపీ జయకేతనం ఎగురవేసింది.
అలా 2020లో ఆప్ పార్టీకి కంచుకోటగా నిలిచిన ఆ 8 నియోజకవర్గాలు తాజా ఎన్నికల్లో బీజేపీ చెంతకు చేరాయి. తాజా ఎన్నికల్లో న్యూ ఢిల్లీ సీటు నుంచి పోటీ చేసిన కేజ్రివాల్ కూడా ఓడిపోయారు. అలాగే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు కీలక నేతలు కూడా ఓటమి పాలయ్యారు. పదేళ్లు అధికారంలో కొనసాగిన ఆప్ పార్టీలో అంతర్గత విభేదాలు కూడా బీజేపీ ఘనవిజయానికి తోడ్పాటునందించాయి.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..