Delhi CM Rekha Gupta: 70 ఏళ్లుగా వాళ్లు చేస్తే రైటు మేం చేస్తే తప్పా
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:50 AM
‘‘డెబ్బై సంవత్సరాలుగా వాళ్లు (కాంగ్రెస్) ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారు. అప్పుడేం కాలేదు. మేం చేస్తే తప్పుగా అనిపిస్తోంది’’ ..ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలివి! ఎన్డీటీవీకి ఇచ్చిన...
ఈవీఎంల హ్యాకింగ్‌పై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: ‘‘డెబ్బై సంవత్సరాలుగా వాళ్లు (కాంగ్రెస్) ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారు. అప్పుడేం కాలేదు. మేం చేస్తే తప్పుగా అనిపిస్తోంది’’ ..ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలివి! ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారని రాహుల్‌గాంధీ అంటున్నారు కదా?’’ అనే ప్రశ్నకు రేఖా గుప్తా ఇలా బదులిచ్చారు. ‘‘వాళ్లు గెలిస్తే ప్రజాతీర్పు అంటారు. మేం గెలిస్తే ఈవీఎం హ్యాక్ అంటారు. ఈ ఫార్ములా ఏ పుస్తకంలో ఉందో ఎవరైనా చెబుతారా నాకు? రాహుల్‌గాంధీ దీన్ని ఎక్కడ చదువుకున్నారు? దేశప్రజలను తప్పుదోవ పట్టించడం ఆయనకు ఇంకేమైనా వచ్చా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఢిల్లీ సీఎం ఏం చెబుతున్నారు’’ అంటూ.. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆ ఇంటర్వ్యూలోని 13 సెకన్ల వీడియో బిట్‌ను ‘ఎక్స్’లో పోస్ట్ చేయగా.. అది విస్తృతంగా వైరల్ అవుతోంది. అయితే.. అది ‘ట్రిమ్’ చేసిన వీడియో అని.. పూర్తి వీడియో ఇదీ అంటూ కొన్ని ఫ్యాక్ట్‌చెక్ వెబ్‌సైట్లు ఒక నిమిషం ఇరవై సెకన్ల వీడియోను పోస్ట్ చేశాయి. పూర్తి వీడియోలో సైతం అవే వ్యాఖ్యలు ఉండడం గమనార్హం.
ఇవి కూడా చదవండి..
జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత... శరవేగంగా వృద్ధి
దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్.. ఇక జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి