Umar House Demolished: ఢిల్లీ బాంబర్ ఉమర్ ఇల్లు కూల్చివేత.. ఉగ్రవాదులకు హెచ్చరిక.!
ABN , Publish Date - Nov 14 , 2025 | 10:42 AM
జమ్ము కశ్మీర్‌లో ఢిల్లీ బాంబర్ ఉమర్ నివాసాన్ని కూల్చివేసినట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. దీంతో దేశంలోఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేవారికి ఇదో హెచ్చరిక సందేశమని స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనకు కారకుడైన ఉమర్ మహమ్మద్(Umar Mohammed) అలియాస్ ఉమర్-ఉన్-నబీ(Umarun-Nabi) ఇంటిని భద్రతా బలగాలు శుక్రవారం నేలమట్టం చేశాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాలో అతడి నివాసాన్ని ఈ తెల్లవారుజామున కూల్చివేసినట్టు(Umar House Demolished) అధికారులు వెల్లడించారు. దీంతో భారత్‌లో ఉగ్రవాద కార్యకలపాలకు మద్దతిస్తున్న వారికి ఇది ఓ సందేశాత్మక హెచ్చరిక అని తెలిపారు.
ఎర్రకోట సమీపంలో గత సోమవారం సాయంత్రం తీవ్ర కలకలం రేపిన ఈ బాంబు పేలుడు(Delhi Blast)లో ఇప్పటివరకూ 13 మంది మృతి చెందారు. 20 మందికిపైగా గాయపడ్డారు. పేలుడు జరిగిన ప్రదేశంలో లభించిన ఉమర్ నమూనాలను అతడి తల్లి నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలతో పోల్చగా.. కారులో ఉన్నది అతడేనని నిర్ధారణ అయింది. నిందితుడు ఉమర్.. ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో వైద్యునిగా పనిచేసేవాడు. ఈ ఘటనలో అతడి సన్నిహితులైన వైద్యులు ముజామ్మిల్, షాహీన్‌లను అదుపులోకి తీస్కుని విచారణ కొనసాగిస్తున్నారు అధికారులు.