Tourism Decline: పాక్‌కు మద్దతుతో తుర్కియే పర్యాటకం ఢమాల్
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:25 AM
తుర్కియేకు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు తుర్కియే బహిరంగంగా మద్దతు ఇచ్చిన ఫలితం ఇది.
అంకారా, ఆగస్టు 23: తుర్కియేకు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు తుర్కియే బహిరంగంగా మద్దతు ఇచ్చిన ఫలితం ఇది. భారత్‌లో ‘బాయ్‌కాట్ తుర్కియే’ ప్రచారం ఊపందుకుంది. గత మూడు నెలల్లోనే తుర్కియేకు భారత పర్యాటకుల సంఖ్య 50% తగ్గింది.
ఈ ఏడాది మేలో 31,659 మంది భారతీయులు తుర్కియేలో పర్యటించగా, జూన్‌లో ఆ సంఖ్య 24,250కి, జూలైలో 16,244కి తగ్గిపోయింది. కాగా, 2024 జూలైలో 28,875 మంది భారతీయులు తుర్కియేలో పర్యటించారు. ఇది ఈ ఏడాది జూలైలో పర్యటించినవారి కంటే 44 శాతం అధికం.
ఇవి కూడా చదవండి..
బిల్లు నుంచి తనను మినహాయించేందుకు ఒప్పుకోని మోదీ
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News