Share News

Tandoori Roti: డాబాలో దారుణం.. పరోటాలో బయటపడ్డ బల్లి..

ABN , Publish Date - Aug 10 , 2025 | 06:56 AM

Tandoori Roti: ఓ పరోటాలో బల్లి కనిపించింది. అది చూసి కస్టమర్ మతిపోయింది. వెంటనే వాంతులు చేసుకోవటం మొదలెట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబసభ్యులు డాబా యజమానితో గొడవకు దిగారు.

Tandoori Roti: డాబాలో దారుణం.. పరోటాలో బయటపడ్డ బల్లి..
Tandoori Roti

మీరెక్కువగా బయటి ఫుడ్డు తింటూ ఉంటారా? అయితే, ఇది మీకోసమే. బయటి ఫుడ్డు తినే మీరు ఎప్పుడైనా అనారోగ్యం పాలుకావచ్చు. మీ అదృష్టం బాగోలేకపోతే ప్రాణాలు కూడా పోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు చూస్తుంటే బయటి ఫుడ్డు తినాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తినే ఆహారంలో పాములు, ఎలుకలు, బల్లులు, క్రిమికీటకాలు బయటపడుతున్నాయి. తాజాగా, పరోటాలో బల్లి బయటపడింది. ఆ పరాటా తిన్న కస్టమర్ ఆస్పత్రిపాలయ్యాడు.


ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కాన్పూర్, చౌబేపూర్‌లో డాబా రామయ్య హోటల్ ఉంది. ఇక్కడ పరోటాలు చాలా ఫేమస్. నిత్యం పెద్ద సంఖ్యలో జనం పరోటాలు తినడానికి వస్తూ ఉంటారు. అది కూడా ఫ్యామిలీలు ఎక్కువగా డిన్నర్ చేయడానికి వస్తూ ఉంటాయి. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ఆ డాబాకు వెళ్లాడు. అందరూ పరోటాలు ఆర్డర్ చేసుకుని తింటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.


ఓ పరోటాలో బల్లి కనిపించింది. అది చూసి కస్టమర్ మతిపోయింది. వెంటనే వాంతులు చేసుకోవటం మొదలెట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబసభ్యులు డాబా యజమానితో గొడవకు దిగారు. వాంతులు చేసుకుంటున్న వ్యక్తి పరిస్థితి బాగోలేకపోవటంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ ప్రపంచంలో పరిశుభ్రత, కస్టమర్ల ఆరోగ్యం గురించి ఆలోచించే హోటళ్లు చాలా తక్కువగా ఉంటాయి. నూటికి 90 శాతం మందికి అది కేవలం బిజినెస్ మాత్రమే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

అప్పుడు అంతలా అవమానించి.. ఇప్పుడు సారీ చెబితే సరిపోతుందా?..

అమెరికా ప్రజలపై ట్రంప్ సుంకాల ప్రభావం..వాల్‌మార్ట్‌లో భారీగా పెరిగిన ధరలు

Updated Date - Aug 10 , 2025 | 07:02 AM