Share News

Rapido Rider Video: అప్పుడు అంతలా అవమానించి.. ఇప్పుడు సారీ చెబితే సరిపోతుందా?..

ABN , Publish Date - Aug 09 , 2025 | 01:57 PM

Rapido Rider Video:ర్యాపిడో రైడర్ ఇంటి దగ్గరకు వచ్చాడు. అతడ్ని చూసి ఆమె రైడ్ క్యాన్సిల్ చేసుకుంది. ఎందుకంటే అతడు లావుగా ఉన్నాడు. బైకు వెనుక భాగంలో కూర్చోవడానికి స్థలం లేదు.

Rapido Rider Video: అప్పుడు అంతలా అవమానించి.. ఇప్పుడు సారీ చెబితే సరిపోతుందా?..
Rapido Rider Video

ఢిల్లీకి చెందిన ఓ యువతి వారం క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ర్యాపిడో బుక్ చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ర్యాపిడో రైడర్ ఇంటి దగ్గరకు వచ్చాడు. అతడ్ని చూసి ఆమె రైడ్ క్యాన్సిల్ చేసుకుంది. ఎందుకంటే అతడు లావుగా ఉన్నాడు. బైకు వెనుక భాగంలో కూర్చోవడానికి స్థలం లేదు. ఆ యువతి రైడ్ క్యాన్సిల్ చేసుకోవడానికి ముందు అతడ్ని వీడియో తీసింది. ‘ర్యాపిడో అతను పిలిచాడు. అతను నా కోసం చూస్తూ ఉన్నాడు. నేను దాక్కొని వీడియో తీస్తూ ఉన్నాను. మీరు ఏమీ అనుకోనంటే ఓ మాట. నేను ఎక్కడ కూర్చోవాలి. ఎవరైనా నాకు చెప్పండి’ అని అంది.


ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ యువతిపై విమర్శలు మొదలయ్యాయి. విమర్శలు రోజు రోజుకు ఎక్కువవటంతో ఆ యువతి స్పందించింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో.. ‘నేను ఆ వీడియో ప్రారంభంలోనే క్లియర్‌గా చెప్పాను. అతడ్ని కించపర్చాలన్న ఉద్దేశ్యం నాకు లేదు అని. నిజంగా నేను అలా అనుకోలేదు. ర్యాపిడో అన్నకు క్షమాపణ చెబుతున్నా. చాలా మంది వేరే వాళ్ల వీడియోలను దొంగిలించి తమ అకౌంట్లలో పోస్ట్ చేసుకుంటున్నారు.


ఆ వీడియోలను తప్పుగా చిత్రీకరిస్తున్నారు. నాకదే నచ్చటం లేదు. నేను తప్పు చేసినట్లు మీరు భావిస్తే.. మీరు కూడా తప్పు చేసినట్లే. మీకు నాకు తేడా లేదు. మీరు రైట్.. నేను రాంగ్ అనడానికి లేదు’ అని అంది. ఈ వీడియోపై కూడా నెటిజన్లు నెగిటివ్‌గానే స్పందిస్తున్నారు. ‘అప్పుడు అంతలా అవమానించి.. ఇప్పుడు సారీ చెబితే సరిపోతుందా’ అంటూ మండిపడుతున్నారు.


ఇవి కూడా చదవండి

పిచ్చి పరాకాష్టకు చేరడం అంటే ఇదే.. రీల్స్ కోసం ఎలాంటి సాహసం చేశారో చూడండి..

పాకిస్తాన్ జెట్లను కూల్చేశాము.. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ ప్రకటన..

Updated Date - Aug 09 , 2025 | 02:05 PM