Vice President Election: ఉపరాష్ట్రపతి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తి
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:18 AM
వచ్చే నెల 9న జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్షాల అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి పరస్పరం తలపడబోతున్నారు...
న్యూఢిల్లీ, ఆగస్టు 22: వచ్చే నెల 9న జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్షాల అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి పరస్పరం తలపడబోతున్నారు. వీరిద్దరు సమర్పించిన 4 సెట్ల నామినేషన్ పత్రాలు సవ్యంగా ఉన్నాయని పరిశీలన అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు బీజేపీకి చెందిన సీపీ రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతున్నారు. తెలంగాణకు చెందిన బి.సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. సంఖ్యాబలం ఎన్డీయేకు అనుకూలంగా ఉంది.
ఇవి కూడా చదవండి..
చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు
వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్
For More National News And Telugu News