Cotton Import: డిసెంబరు 31 వరకు పత్తిపై దిగుమతి సుంకం మినహాయింపు
ABN , Publish Date - Aug 29 , 2025 | 02:56 AM
అమెరికా సుంకాలు అమల్లోకి వచ్చిన వేళ.. దేశీయ టెక్స్‌టైల్ పరిశ్రమకు ఊరట కల్పించే లక్ష్యంతో ...
న్యూఢిల్లీ, ఆగస్టు 28: అమెరికా సుంకాలు అమల్లోకి వచ్చిన వేళ.. దేశీయ టెక్స్‌టైల్ పరిశ్రమకు ఊరట కల్పించే లక్ష్యంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబరు నెలాఖరు వర కూ పత్తిపై దిగుమతి సుంకం మినహాయింపును ఇవ్వనుంది. గతంలో సెప్టెంబరు నెలాఖరు వరకు ఇచ్చిన మినహాయింపు గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ గురువా రం ప్రకటించింది. దేశీయ వస్త్ర పరిశ్రమ రంగానికి సరిపడినంత ముడి పత్తి అందుబాటులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దేశీయ రంగాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందని గ్లోబల్ ట్రేడ్ రీసె ర్చ్ ఇనిషియేటివ్ ఫౌండర్ అజయ్‌శ్రీవాత్సవ చెప్పారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..