Congress Slams BJP: రైల్వే ఈ టికెట్‌పై ఆపరేషన్ సిందూర్ ప్రచారం..బీజేపీ రాజకీయం చేస్తోందన్న కాంగ్రెస్
ABN , Publish Date - May 19 , 2025 | 09:35 AM
దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులకు అందుతున్న టికెట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని ప్రదర్శించడం ‘ఆపరేషన్ సిందూర్’ ప్రచారంలో భాగంగా తీసుకున్న నిర్ణయం. కానీ ఇది రాజకీయ దుమారానికి కారణమైంది. భారతీయ రైల్వే ఈ ప్రచారాన్ని అమలు చేయగా, టికెట్లపై మోదీ చిత్రం ఎందుకని కాంగ్రెస్ సహా పలు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
భారతీయ రైల్వే ఈ టికెట్లపై ‘ఆపరేషన్ సిందూర్’ ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని ప్రదర్శించడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రచారంపై కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు చేసింది. దీనిపై ఖర్చు చేసి ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. అంతేకాదు బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇలాంటి ప్రచారం చేయడం ఏంటని ప్రభుత్వాన్ని అడిగింది. ఈ చర్యను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించింది.
బాబేల్ ఆరోపణ
మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ మీడియా సలహాదారు పీజుష్ బాబేల్ ఈ టికెట్ల గురించి సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేసి పేర్కొన్నారు. ఇది మోదీ ప్రభుత్వం ప్రకటన. వారు ఆపరేషన్ సిందూర్‌ను ఒక ప్రకటనగా ఉపయోగించి, రైల్వే టికెట్లపై పోస్టర్‌లా ప్రదర్శించారు. సైనిక వీరత్వాన్ని ఇప్పుడు వారు ఉత్పత్తిగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇది జాతీయత కాదని వ్యాఖ్యానించారు.
టికెట్లపై ప్రచారం
(Indian Railway Catering and Tourism Corporation) ఈ-టికెట్‌ను 17 మే 2025న Bhopal-Jhansi రూట్‌లో బుక్ చేసుకున్న ప్రయాణికుడి టికెట్‌లో ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాటు ప్రధానమంత్రి మోదీ ఫోటోతో ఓ ప్రకటనగా కనిపిస్తోంది. అయితే బీజేపీ భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
బీఎస్పీ ఎంపీ కూడా అభ్యంతరం
బహుజన్ సమాజ పార్టీ (BSP) ఎంపీ కున్వర్ దానిష్ అలీ కూడా ఈ అంశంపై స్పందించారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ప్రధానమంత్రి మోదీ.. యుద్ధం, సైనిక ధైర్యాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఎందుకంటే సైనికులు ధైర్యంగా పోరాడి ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ వారి ముఖాలు లేదా పేర్లు అక్కడ లేవు. దీనిలో మోదీ ముఖంతో కూడిన ప్రచారం మాత్రమే కనిపిస్తోందన్నారు, ఇది కరేక్టెనా అని ప్రశ్నించారు.
రైల్వే బోర్డు సమాధానం
ఈ వివాదం నేపథ్యంలో రైల్వే బోర్డు అధికారిక ప్రతినిధి దిలీప్ కుమార్ స్పందించారు. ప్రకటనలో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని దేశప్రజలందరికీ చేరవేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రచారం చేపడుతున్నట్లు తెలిపారు. భారతీయ రైల్వేలు ఆపరేషన్ సిందూర్ విజయాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నట్లు వెల్లడించారు. సైనికుల వీరత్వాన్ని మనం గౌరవిస్తున్నాం. ఈ ప్రచారాన్ని టికెట్లపై, స్టేషన్లలో త్రివర్ణ పతాకం ద్వారా ప్రదర్శిస్తున్నామన్నారు. ఈ ప్రాముఖ్యత గురించి జాతీయ స్థాయి ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి
UPI New Rule: యూపీఐ కొత్త రూల్.. తప్పు చెల్లింపుల కట్టడి కోసం కీలక సౌకర్యం..
Jyoti Malhotra Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి షాకింగ్ ఫాక్ట్స్
EPFO: ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి