Congress strategy: కాంగ్రె్‌సలో జిల్లా కమిటీలకు పెద్దపీట!
ABN , Publish Date - Feb 20 , 2025 | 04:59 AM
ఎన్నికల ఫలితాలపై వాటినే జవాబుదారీగా చేయాలి’’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. డీసీసీలను బలోపేతం చేసేందుకు అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న రిలే యాత్రలను ప్రారంభిస్తామని..
ఎన్నికల ఫలితాల బాధ్యత రాష్ట్ర ఇన్‌చార్జులైన ఏఐసీసీ ఆఫీస్ బేరర్లదే: మల్లికార్జున్ ఖర్గే
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ‘‘బీజేపీని ఎదుర్కోవాలంటే.. మన జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)లను బలోపేతం చేయాలి. సంస్థాగతంగా జిల్లా కమిటీలనే కేంద్రంగా మార్చాలి. ఎన్నికల ఫలితాలపై వాటినే జవాబుదారీగా చేయాలి’’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. డీసీసీలను బలోపేతం చేసేందుకు అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న రిలే యాత్రలను ప్రారంభిస్తామని.. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం(జనవరి 26) వరకు వాటిని కొనసాగిస్తామన్నారు. బుధవారం ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయమైన ఇందిరాభవన్‌లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జులతో ఖర్గే సమావేశమయ్యారు. సుమారు ఏడు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.
కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నవారికే పదోన్నతుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గట్టిగా నిలబడినవారికే పెద్దపీట వేయాలని ఖర్గే తేల్చిచెప్పారు. కొద్ది రోజుల క్రితమే పార్టీలో భారీగా సంస్థాగత మార్పులు జరిపిన ఖర్గే.. పార్టీలో మరిన్ని మార్పులుంటాయని వెల్లడించారు. భవిష్యత్‌లో రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ఫలితాలకు ఆ రాష్ట్రాలకు ఇన్‌చార్జులుగా ఉన్న ఏఐసీసీ ఆఫీసు బేరర్లనే జవాబుదారీ చేస్తామని స్పష్టంచేశారు. ‘జైబాపు, జైభీమ్, జై సంవిధాన్’ కార్యక్రమం మరో ఏడాది కొనసాగుతుందని.. ఇందులో భాగంగా పాదయాత్రలు, చర్చలు, వీధిమలుపు సమావేశాల వంటివి నిర్వహిస్తామని చెప్పారు. కాగా, అమెరికా నుంచి పంపేస్తున్న భారతీయులకు అవమానాలు జరక్కుండా నిరోధించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ఖర్గే అన్నారు.
ఇవి కూడా చదవండి:
Anti Corruption: అవినీతిని అరికట్టేందుకు కీలక చర్యలు.. 52 మంది అధికారుల సస్పెండ్
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
Read More Business News and Latest Telugu News