Share News

Bihar Elections: నాడు నోట్ల రద్దు.. నేడు ఓట్ల రద్దు

ABN , Publish Date - Jul 18 , 2025 | 05:49 AM

ఓటర్ల నుంచి ఓటు హక్కును లాక్కోవటం ద్వారా బిహార్‌ ఎన్నికల్లో భారీ ఎత్తున రిగ్గింగ్‌ చేయటానికి కుట్ర జరుగుతోందని, దాంట్లో భాగంగానే ఎన్నికల సంఘం

Bihar Elections: నాడు నోట్ల రద్దు.. నేడు ఓట్ల రద్దు

  • బిహార్‌లో భారీ ఎత్తున ఓట్ల తొలగింపు ద్వారా రిగ్గింగ్‌కు కుట్ర: రాహుల్‌

న్యూఢిల్లీ, జూలై 17: ఓటర్ల నుంచి ఓటు హక్కును లాక్కోవటం ద్వారా బిహార్‌ ఎన్నికల్లో భారీ ఎత్తున రిగ్గింగ్‌ చేయటానికి కుట్ర జరుగుతోందని, దాంట్లో భాగంగానే ఎన్నికల సంఘం (ఈసీ) ఆ రాష్ట్రంలో ‘ఓటర్ల జాబితా సవరణ’ (సర్‌)ను చేపట్టిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. గతంలో నోట్లరద్దు చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు బిహార్‌లో ఓట్లరద్దుకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తింది. గురువారం ఈ అంశంపై ఆ పార్టీ నేతలు పలువురు ఎక్స్‌లో పోస్ట్‌లు పెట్టారు. ‘సర్‌ పేరుతో ఓట్లను దొంగిలిస్తూ ఈసీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. చేసేదేమో దొంగతనం.. పేరు మాత్రం సర్‌. దీనిని బట్టబయలు చేసిన వారి మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు’ అంటూ రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు.

Updated Date - Jul 18 , 2025 | 05:49 AM