Election Bonds,: ఐటీ బిల్లులో ఎన్నికల బాండ్లకు అవకాశం!
ABN , Publish Date - Feb 18 , 2025 | 04:40 AM
ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంది. ఈ మేరకు గత ఏడాది ఫిబ్రవరి 15న ఇచ్చిన ఉత్తర్వుల్లో కేంద్ర ఎలక్టోరల్ బాండ్ స్కీంను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం: నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: కొత్త ఆదాయ పన్ను బిల్లు-2025లో ఎన్నికల బాండ్లకు సంబంధించి నిబంధనలను చేర్చడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంది. ఈ మేరకు గత ఏడాది ఫిబ్రవరి 15న ఇచ్చిన ఉత్తర్వుల్లో కేంద్ర ఎలక్టోరల్ బాండ్ స్కీంను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే కొత్త ఐటీ బిల్లు షెడ్యూల్ 8లో ఎన్నికల బాండ్ల గుర్తించి ప్రస్తావన చేశారు. చట్టాల్లోని లోపాలను ఆసరాగా చేసుకొనో, లేదంటే వేరే వేరే రూపాల్లోనో ఎన్నికల బాండ్లను తిరిగి ప్రవేశపెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోందని నిపుణులు విశ్లేషించారు.
ఇవి కూడా చదవండి..
ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..