Share News

CJI: రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ పదవులకు దూరం: సీజేఐ

ABN , Publish Date - Jul 25 , 2025 | 09:15 PM

భారతదేశ 52వ సీజేఐగా ఉన్న బీఆర్ గవాయ్ ఈ ఏడాది నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. మహారాష్ట్రలోని అమ్రావతి జిల్లాలో 1960 నవంబర్ 24న ఆయన జన్మించారు. బౌద్ధ మతం నుంచి సీజేఐ అయిన తొలి వ్యక్తి కూడా ఆయనే కావడం విశేషం.

CJI: రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ పదవులకు దూరం: సీజేఐ
CJI Gavai

ముంబై: పదవీ విరమణ చేసిన తర్వాత ఎలాంటి ప్రభుత్వ పదవులను అంగీకరించేది లేదని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్ (BR Gavai) చెప్పారు. మహారాష్ట్రలోని అమ్రావతి జిల్లాలో తన స్వగ్రామమైన దారాపూర్‌లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ పదవులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత చేతినిండా సమయం దొరుకుతుందని, ఎక్కువ సమయం దారాపూర్, అమ్రావతి, నాగపూర్‌లలో గడుపుతానని చెప్పారు.


నవంబర్‌లో రిటైర్మెంట్

భారతదేశ 52వ సీజేఐగా ఉన్న గవాయ్ ఈ ఏడాది నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. మహారాష్ట్రలోని అమ్రావతి జిల్లాలో 1960 నవంబర్ 24న ఆయన జన్మించారు. బౌద్ధ మతం నుంచి సీజేఐ అయిన తొలి వ్యక్తి కూడా ఆయనే కావడం విశేషం. మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా రిటైర్మెంట్ తర్వాత గవాయ్‌ సీజేఐ బాధ్యతలు చేపట్టారు. 2005లో ముంబై హైకోర్టు పెర్మనెంట్ జడ్జి అయిన గవాయ్.. 2019 మేలో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ 2023 డిసెంబర్‌లో కీలక తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో గవాయ్ కూడా ఒకరు.


ఇవి కూడా చదవండి..

ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో 32 గంటలు చర్చ: కేంద్ర మంత్రి

అప్పుడు తప్పు చేశా, ఇప్పుడు సరిదిద్దుకుంటున్నా: రాహుల్ గాంధీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 09:23 PM