Share News

Vijay Rally Stampede: విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. 31 మంది మృతి

ABN , Publish Date - Sep 27 , 2025 | 08:56 PM

విజయ్ ర్యాలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ర్యాలీలో గోడ కూలిన ఘటనతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో అభిమానులు మృతిచెందినట్లు తెలుస్తోంది.

Vijay Rally Stampede: విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. 31 మంది మృతి
Vijay

కరూర్: టీవీకే అధినేత విజయ్‌ (Vijay) ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 31 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరూర్ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో పలువురు చిన్నారులు ఉన్నట్టు స్థానిక ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అనుకున్న సమయానికి ఆరు గంటలు ఆలస్యంగా వేదిక వద్దకు విజయ్ చేరుకోవడంతో ఆయనను చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. దీంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. రాత్రి 7:45 గంటలకు ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది.


ర్యాలీలో 30,000 మందికి పైగా జనం పాల్గొన్నట్టు చెబుతున్నారు. విజయ్‌ను చూసేందుకు ఒక భవంతి పిట్టగోడపై పలువురు చేరడంతో పిట్టగోడ కుప్పకూలిందని, దీంతో పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. దీంతో కొంత గందరగోళం, తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. దీంతో విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు. వేదిక పైనుంచి 'పోలీస్ ప్లీజ్ హెల్ప్' అంటూ విజ్ఞప్తి చేశారు.


సీఎం దిగ్భ్రాంతి..

విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటనపై సీఎం ఎంకే స్టాలిన్‌ (MK Stalin) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కరూర్ జిల్లా కార్యదర్శి వి.సెంథిల్‌ బాలాజీని ఆదేశించారు. కరూర్ నుంచి వచ్చిన సమాచారం తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందని, తొక్కిసలాటలో స్పృహతప్పి ఆసుపత్రిలో చేరిన వారికి తక్షణ వైద్య సాయం అందించాల్సింగా స్థానిక యంత్రాంగాన్ని కోరామని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన తెలిపారు.


ప్రధాని దిగ్భ్రాంతి..

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మోదీ ఆదేశించారు.


విజయ్‌ను నిలదీసిన హైకోర్టు..

కాగా, టీవీకే ర్యాలీలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారంటూ టీవీకే పార్టీ ఇటీవల మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. అన్ని పార్టీలకూ ఈ ఆంక్షలు వర్తిస్తాయా? అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఈనెల 13న విజయ్ తిరుచ్చి ర్యాలీలో జనం అదుపుతప్పడాన్ని జస్టిస్ ఎన్.సతీష్ కుమార్ ప్రస్తావిస్తూ.. జరగరానిది ఏదైనా జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షుడు క్రౌడ్స్‌ను విజయ్ కంట్రోల్ చేయాల్సి ఉంటుందన్నారు.


ఇవి కూడా చదవండి..

చొరబాట్లకు సిద్ధంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు.. బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడి

ఇక్కడున్నది ఎవరో మౌలానా మర్చిపోయినట్టున్నారు... యోగి స్ట్రాంగ్ వార్నింగ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2025 | 10:00 PM