Naxal Ordnance Factory: మావోల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ధ్వంసం..
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:11 PM
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా మెట్టగూడా అటవీ ప్రాంతంలో ఉన్న మావోయిస్టుల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. ఫ్యాక్టరీ నుంచి భారీఎత్తున విస్ఫోటక పదార్థాలు, యంత్రాలు స్వాధీనం చేసుకున్నాయి.
మెట్టగూడ, సెప్టెంబర్ 27: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా మెట్టగూడా అటవీ ప్రాంతంలో ఉన్న మావోయిస్టుల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని భద్రతా దళాలు ఇవాళ (శనివారం) ధ్వంసం చేశాయి. ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున విస్ఫోటక పదార్థాలు, యంత్రాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో మావోయిస్టులు పెద్ద BGL లాంచర్ తయారీలో నిమగ్నమై ఉన్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఎస్పీ కిరణ్ చవాన్ నాయకత్వంలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించి ఈ మేరకు విజయం సాధించాయి.
సుక్మా జిల్లా దళాలు, కోబ్రా 203 టీమ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ క్యాంప్ మెట్టగూడ ప్రాంతంలో జరిగింది. భద్రతా సిబ్బంది పెద్దఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు, భారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నిలువు మిల్లింగ్ యంత్రం, BGL లాంచర్, షెల్లు, IED పైపులు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
ఆకుల మధ్యలో కప్ప.. 6 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లకు తిరుగులేనట్టే..
షాకింగ్ సీన్.. చూస్తుండగానే రోడ్డు ఎలా కూలిపోయిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..