Lightning Strike: పిడుగు పడి ఫోన్ పేలడంతో యువకుడి దుర్మరణం
ABN , Publish Date - May 18 , 2025 | 10:29 PM
పిడుగు పడి చేతిలోని ఫోన్ పేలడంతో ఓ యువకుడు మరణించిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసింది. పిడుగు పడటంతోనే ఫోన్ పేలి ఉంటుందని వైద్యులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: పిడుగు పడటంతో చేతిలోని ఫోన్ పేలి ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరీ జిల్లాలో తాజాగా చోటు చేసుకుంది. పిడుగు ధాటికి చెవి దగ్గర ఉన్న ఫోన్ పేలడంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం పెద్దాసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు. బాధితుడిని రోహిత్ కుమార్ సిన్హాగా గుర్తించారు.
మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, రోహిత్ శుక్రవారం తన పని ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో బాత్‌రూమ్ నిర్మాణ పనులు జరుగుతుంటే పర్యవేక్షించేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అతడు ఫోన్ మాట్లాడుతుండగా పిడుగు పడింది. దీంతో, ఒక్కసారిగా ఫోన్ పేలడంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రోహిత్ గాయాల తీవ్రత దృష్ట్యా జిల్లా ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు తెలిపారు. అయితే, రోహిత్ జిల్లా ఆసుపత్రికి వెళుతుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశాడు.
‘‘మొబైల్ ఫోన్ పిడుగును ఆకర్షించడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడుకు ఇదే కారణం కావొచ్చు. మొబైల్ ఫోన్ రేడియేషన్ వెలువరిస్తుంది. ఇందులో అయస్కాంత గుణం ఉన్న విడిభాగాలు ఉంటాయి. వీటికి పిడుగులను ఆకర్షించే లక్షణం ఉంటుంది’’ అక్కడి డాక్టర్ తెలిపారు.
పిడుగు పాటుకు గురి కాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాన పడుతున్న సమయాల్లో ఇంట్లో ఉండటం లేదా కారులోపల కూర్చోవాలి. చెట్లు, ఎత్తైన ప్రదేశాలకు దూరంగా ఉండాలి. నీటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. కొలనులు, జలపాతాల వద్దకు వెళ్లొద్దు. లోహంతో చేసిన వస్తువుల ఏవైనా ఉంటే వాటిని వెంటనే పక్కన పెట్టేయాలి.
ఇవీ చదవండి:
ట్రంప్ తన పంతం నెగ్గించుకుంటే.. భారత్‌కు ఏటా 18 బిలియన్ డాలర్ల నష్టం
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి