Share News

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. కీలక నేత హతం

ABN , Publish Date - May 03 , 2025 | 01:02 PM

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత హతమయ్యాడు. గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. కీలక నేత హతం
Chhattisgarh Encounter

ఛత్తీస్‌గఢ్‌, మే 3: ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ జిల్లాలో ఎన్‌కౌంటర్ (Chhattisgarh Encounter) జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో డివిజన్ కమిటీ సభ్యుడు ఐతు అలియాస్ యోగేష్ కోర్సా హతమయ్యాడు. ఘటనా స్థలంలో భారీగా ఎస్‌ఎల్‌ఆర్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల కోసం భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.


మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యమంతా వార్‌జోన్‌గా మారింది. ఈరోజు గరియాబంద్‌లో మావోలకు, భద్రతా బలగాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో కీలక మావోయిస్టు నేత హతమయ్యాడు. అతను సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్ టీం కమాండర్‌గా ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మరోవైపు మావోయిస్టు కీలక నేతలే టార్గెట్‌గా కొనసాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్టలు 13వ రోజు కూంబింగ్ కొనసాగుతోంది. బీజాపూర్ - తెలంగాణ సరిహద్దులో ఉన్న నీలంసారాయి, దోబిగుట్టలను భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో ఆక్రమించాక అక్కడి నుంచి కర్రెగుట్టలు చేరాలంటే మరో 45 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీల్లో తెలంగాణకు చెందిన కీలక నేతలు ఉండటంతో తెలంగాణ నేతలు, అధికారపక్ష పార్టీ నేతలు, తెలంగాణకు చెందిన వారంతా కూడా వారిని రెస్క్యూ చేసే పనిలో ఉన్నారని, మావోయిస్టులకు మద్దతుగా ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బార్డర్‌లో తెలంగాణ గ్రేహౌండ్స్ పూర్తి స్థాయిలో మానిటర్ చేయడం లేదని విజయ్ శర్మ అన్నారు.

Toppudurthi Issue: తోపుదుర్తిని తప్పిస్తున్నారా.. బయటపడ్డ పోలీసుల వైఫల్యం


కాగా.. ఆపరేషన్ కర్రెగుట్టలను ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆపాలంటూ ఇప్పటికే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సామాజిక కోణంలో చూస్తున్నామని చెప్పడంతో పాటు.. కేకే కూడా లేఖ రాశారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతం నుంచి రాజకీయ పక్షాలన్నీ కూడా ఆపరేషన్ కర్రెగుట్టలను నిలిపివేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ బలగాలు, అక్కడున్న పోలీసులు.. తెలంగాణ నేతలపై కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు మొత్తం నివురుగప్పిన నిప్పులా ఉంది. కర్రెగుట్టల్లో కేంద్ర కమిటీకి సంబంధించిన చంద్రన్న, రామ చంద్రారెడ్డి, సుజాత్‌తో పాటు గెరిల్లా సుప్రీం కమాండర్‌గా ఉన్న హిడ్మా, బెటాలియన్ కమాండర్ దేవాతో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా కర్రెగుట్టల్లో ఉన్నారంటూ నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆపరేషన్ కర్రెగుట్టల్లో కీలకమైన మావోయిస్టు నేతల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి

Toppudurthi Issue: తోపుదుర్తిని తప్పిస్తున్నారా.. బయటపడ్డ పోలీసుల వైఫల్యం

AP Ration Card: రేషన్‌కార్డుదారులకు నో చింత.. గడువు పెంచిన సర్కార్

Read Latest National News And Telugu News

Updated Date - May 03 , 2025 | 01:22 PM