Chennai News: కారుతో యువకుడిని ఢీకొట్టిన ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:09 PM
తిరునల్వేలిలో బుధవారం రాత్రి మద్యం మత్తులో బైకుపై వెళుతున్న యువకుడిని కారుతో ఢీకొట్టిన ట్రాఫిక్ విభాగం ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు పడింది. తూత్తుకుడి జిల్లా కయిత్తారుకు చెంందిన గాంధీరాజన్ (59) తిరునల్వేలిలో ట్రాఫిక్ విభాగం ఎస్‌గా పనిచేస్తున్నారు.
చెన్నై: తిరునల్వేలిలో బుధవారం రాత్రి మద్యం మత్తులో బైకుపై వెళుతున్న యువకుడిని కారుతో ఢీకొట్టిన ట్రాఫిక్ విభాగం ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు పడింది. తూత్తుకుడి జిల్లా కయిత్తారుకు చెంందిన గాంధీరాజన్ (59) తిరునల్వేలిలో ట్రాఫిక్ విభాగం ఎస్‌గా పనిచేస్తున్నారు. సుద్ధమల్లి ప్రాంతంలో నివసిస్తున్న గాంధీరాజన్ ఓపెన్‌హార్ట్ సర్జరీ చేసుకోవడంతో తన సొంత కారులోనే డ్యూటీకి వెళుతుంటారు.
ఆ నేపథ్యంలో బుధవారం రాత్రి డ్యూటీ ముగించుకుని తిరునల్వేలి టౌన్ సౌత్ మౌంట్‌రోడ్డు మీదుగా కారులో ఇంటికి బయలుదేరారు. ఓ థియేటర్ వద్ద ఆ కారు ముందు వెళుతున్న బస్సు సడెన్ బ్రేక్ వేయడంతో ఆ బస్సు వెనుక వెళ్తున్న బైకును ఎస్‌ఐ గాంధీరాజన్ కారు ఢీకొంది. దీంతో ఆ బైకును నడిపిన అశోక్‌కుమార్ అనే యువకుడు స్వల్పంగా గాయపడాడు. దీనితో అశోక్‌కుమార్ కోపంగా గాంధీరాజన్‌ను దూషించి, కారు ముందు బ్యానెట్‌పైకి ఎక్కాడు.
దీంతో ఎస్‌ఐ గాంధీ రాజన్(SI Gandhi Rajan) కారు వేగాన్ని పెంచి బ్యానట్‌పై నిలబడిన అశోక్‌కుమార్ కిందకు పడేసేందుకు ప్రయత్నించాడు. వాటిని పాదచారులెవరో వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ఎస్‌ఐ గాంధీ రాజన్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎస్‌ఐ గాంధీరాజన్, బైకు నడిపిన అశోక్‌కుమార్ మద్యం మత్తులో గొడవ పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన ధరలకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి
శశికళ కేసు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
Read Latest Telangana News and National News