Minister: అమీబాపై ఆందోళన వద్దు..
ABN , Publish Date - Aug 29 , 2025 | 10:09 AM
కేరళ రాష్ట్రంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ‘అమీబా’ వ్యాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం పేర్కొన్నారు.ఆయన గురువారం నగరంలో మీడియాతో మాట్లాడుతూ...కార్పొరేషన్, మున్సిపాలిటీ, పశుసంవర్థకశాఖల సహకారంతో వీధి కుక్కల బెడదను నివారించేందుకు పలు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
- మంత్రి సుబ్రమణ్యం సూచన
చెన్నై: కేరళ(Kerala) రాష్ట్రంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ‘అమీబా’ వ్యాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) పేర్కొన్నారు.ఆయన గురువారం నగరంలో మీడియాతో మాట్లాడుతూ...కార్పొరేషన్, మున్సిపాలిటీ, పశుసంవర్థకశాఖల సహకారంతో వీధి కుక్కల బెడదను నివారించేందుకు పలు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న 2,336 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుక్క, పాము కాటుకు ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని, దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వెంటనే చికిత్స అందుతుందని తెలిపారు. పొరుగురాష్ట్రమైన కేరళలో ఇటీవల కాలంలో మెదడుకు హాని కలిగించే అమీబా వ్యాధి వేగంగా అభివృద్ధి చెందుతోందని,

ఇది రోజుల తరబడి చెరువుల్లో నిల్వవున్న నీటిలో స్నానం చేయడం వల్ల వస్తుందన్నారు. మెదడుపై తీవ్ర ప్రభావం చూపే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశాలు లేవని వైద్య పరీక్షల్లో తేలిందన్నారు. రాష్ట్రంలో ఈ వ్యాధి వ్యాపించకుండా పటిష్ఠచర్యలు చేపట్టినందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు
Read Latest Telangana News and National News