Share News

GCC Mayor: పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:21 AM

దేశంలోనే మొట్టమొదటి సారిగా పెంపుడు జంతువులను పర్యవేక్షించేందుకు వాటికి మైక్రో చిప్‌ అమర్చేందుకు, లైసెన్స్‌ తదితర సేవలను జతచేస్తూ కొత్తగా రూపొందించిన వెబ్‌సైట్‌ను గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ఆర్‌.ప్రియ ప్రారంభించారు.

GCC Mayor: పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌

- ప్రారంభించిన జీసీసీ మేయర్‌

చెన్నై: దేశంలోనే మొట్టమొదటి సారిగా పెంపుడు జంతువులను పర్యవేక్షించేందుకు వాటికి మైక్రో చిప్‌ అమర్చేందుకు, లైసెన్స్‌ తదితర సేవలను జతచేస్తూ కొత్తగా రూపొందించిన వెబ్‌సైట్‌ను గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ఆర్‌.ప్రియ(Greater Chennai Corporation Mayor R. Priya) శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మీడియాతో మాట్లాడుతూ, నగర పాలక సంస్థల చట్ట ప్రకారం జంతువులను పెంచేందుకు లైసెన్స్‌ తప్పనిసరని,


nani1.jpg

ఈ విధానాన్ని, సులభతరం చేసేలా 2023 నుండి వెబ్‌సైట్‌ ద్వారా లైసెన్సుల పంపిణీ జరుగుతోందని, ప్రస్తుతం ఈ సేవల విస్తరణకు జీసీసీ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అన్ని రకాల పెంపుడు జంతువులకు మైక్రో చిప్‌ పొందుపరచాల్సిందిగా వాటి యజమానులకు సూచించామని, ఈ చిప్‌లో యజమాని పేరు, చిరునామా, ఫోన్‌ నెంబర్‌ తదితర వివరాలను రికార్డు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆధునిక సేవలు నగరంలోని ఆరు పెంపుడు జంతువుల చికిత్సా కేంద్రాల్లో ఈ నెల 8వ తేదీ నుంచి ఉచితంగా అందుబాటులో ఉంటాయని,


nani1.2.jpg

వీటితో పాటు పిచ్చికుక్క కాటుకు ఉచిత ఇంజక్షన్‌ సౌకర్యం ఉంటుందన్నారు. కుక్కల బెడదకు సంబంధించి ‘9445061913’ అనే వాట్స్‌ప్‌ నెంబర్‌కు, లైసెన్స్‌ పొందగోరువారు chennai corporation. gov.in అనే వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సిందిగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ మహే్‌షకుమార్‌, కమిషనర్‌ కుమరగురుపరన్‌, సంయుక్త కమిషనర్‌ జయశీలన్‌, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విజయ్‌ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం.. అనుకున్నదే జరిగింది 

పెరిగిన ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు.. ఏ సేవకి ఎంత చెల్లించాలంటే

Read Latest Telangana News and National News

Updated Date - Oct 04 , 2025 | 11:21 AM