Chennai News: కాలువ కోసం రూ.10 కోట్ల స్థలం విరాళం..
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:29 AM
ప్రభుత్వానికి స్థలం విరాళంగా అందజేసిన దంపతులను అధికారులు ఘనంగా సత్కరించారు. తిరుప్పూర్ కార్పొరేషన్ 8వ వార్డు ప్రాంతంలో కాలువలు సక్రమంగా లేకపోవడంతో, వర్షాల సమయంలో నీరు వెళ్లే దారిలేక సమీపంలోని ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి.
చెన్నై: ప్రభుత్వానికి స్థలం విరాళంగా అందజేసిన దంపతులను అధికారులు ఘనంగా సత్కరించారు. తిరుప్పూర్ కార్పొరేషన్ 8వ వార్డు ప్రాంతంలో కాలువలు సక్రమంగా లేకపోవడంతో, వర్షాల సమయంలో నీరు వెళ్లే దారిలేక సమీపంలోని ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ ప్రాంతంలో వాననీటి కాలువ నిర్మించేందుకు తగిన స్థలం లేకపోవడంతో కార్పొరేషన్ అధికారులు ఏం చేయలేక ఉండిపోయారు.

ఈ నేపథ్యంలో, అదే ప్రాంతానికి చెందిన మాజీ ఉపాధ్యాయుడు కృష్ణస్వామి-వల్లియమ్మాళ్(Keushna Swami-Valliyammal) దంపతులు తమకు సొంతమైన రూ.10 కోట్ల విలువైన స్థలాన్ని వాననీటి కాలువ నిర్మాణం కోసం విరాళంగా అందించేందుకు అంగీకరించారు. శుక్రవారం ఆ దంపతులను స్థానికులు బాణాసంచా, మేళతాళాల నడుమ కార్పొరేషన్ కార్యాలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. కార్పొరేషన్ అధికారులు దంపతులను పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం స్థలానికి సంబంధించిన పత్రాలను దంపతులు కార్పొరేషన్ అధికారులకు అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోషల్ మీడియాలో ఇళయరాజా ఫొటో వాడొద్దు
Read Latest Telangana News and National News