Share News

Chennai News: గర్భిణిని చేసి మోసం చేశాడు..

ABN , Publish Date - Aug 30 , 2025 | 10:21 AM

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భిణిని చేశాడంటూ నటుడు మాదంపట్టి రంగరాజ్‌పై ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ జాయ్‌ కిరిసిల్డా ఆరోపించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం చెన్నై నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

Chennai News: గర్భిణిని చేసి మోసం చేశాడు..

చెన్నై: తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భిణిని చేశాడంటూ నటుడు మాదంపట్టి రంగరాజ్‌పై ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ జాయ్‌ కిరిసిల్డా ఆరోపించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం చెన్నై నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ... మాదంపట్టి రంగరాజ్‌ మాదంపట్టి కేటరింగ్‌ సంస్థను నడుపుతుండగా, ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు తనతో పరిచయం ఏర్పడిందన్నారు.


ఆ తర్వాత చెన్నైలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకుని ఒకే ఇంటిలో కాపురం ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం తాను ఆరు నెలల గర్భిణిని అని, ఈ నేపథ్యంలో తనను వదిలివెళ్ళిపోయారని పేర్కొన్నారు. తనను పెళ్లి పేరుతో మోసం చేశారని, అందువల్ల ఆయనపై తగిన చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇన్‌ఫార్మర్‌ నెపంతో గిరిజనుడి హత్య

గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో బాలుడి మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 30 , 2025 | 10:21 AM