Share News

IIT expansion : ఐఐటీల విస్తరణ

ABN , Publish Date - Feb 02 , 2025 | 04:33 AM

ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఐఐటీల్లో మరో 6,500 మంది విద్యార్థులకు చోటు కల్పించేలా ఐదు ఐఐటీల విస్తరణ, కొత్తగా 10 వేల మెడికల్‌ సీట్లు, కృత్రిమమేధకు మరింత ప్రోత్సాహం.. విద్యారంగానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన వరాలివీ. బడ్జెట్‌లో కేంద్ర

 IIT expansion : ఐఐటీల విస్తరణ

అదనంగా 6,500 మంది విద్యార్థులకు చోటు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఐఐటీల్లో మరో 6,500 మంది విద్యార్థులకు చోటు కల్పించేలా ఐదు ఐఐటీల విస్తరణ, కొత్తగా 10 వేల మెడికల్‌ సీట్లు, కృత్రిమమేధకు మరింత ప్రోత్సాహం.. విద్యారంగానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన వరాలివీ. బడ్జెట్‌లో కేంద్ర విద్యామంత్రిత్వశాఖకు మొత్తంగా రూ.1.28లక్షల కోట్లు కేటాయించారు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన కేటాయింపులు రూ.1.14 లక్షల కోట్ల (సవరించిన అంచనాలు) కన్నా అధికం. కాగా, ఈసారి విద్యారంగానికి జరిగిన కేటాయింపుల్లో ఉన్నత విద్యకు రూ.50,067 కోట్లు, పాఠశాల విద్యకు రూ.78,572 కోట్లు కేటాయించారు. గత పదేళ్లలో దేశంలోని మొత్తం 23 ఐఐటీల్లో సీట్ల సంఖ్య 65 వేల నుంచి 1,35,000కు పెరిగింది. ఈ క్రమాన్ని కొనసాగిస్తూ.. 2014 అనంతరం ప్రారంభించిన ఐదు ఐఐటీల్లో మరో 6,500 మంది విద్యార్థులు అదనంగా విద్యను అభ్యసించేలా మౌలిక సదుపాయాలను విస్తరించనున్నారు. ఐఐటీలకు బడ్జెట్‌లో రూ.11,349 కోట్లు కేటాయించారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలు రూ.10,467 కోట్ల కన్నా ఎక్కువ. వచ్చే ఐదేళ్లలో ఐఐటీలు, ఐఐఎ్‌ససీలో సాంకేతిక పరిశోధనలకు పది వేల ఫెలోషి్‌పలు ఇవ్వనున్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా ప్రభుత్వ పాఠశాలల్లో 50 వేల ‘అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌’ను ఏర్పాటు చేస్తారు. వీటిలో రోబోటిక్స్‌, త్రీడీ ప్రింటింగ్‌ తదితర నూతన టెక్నాలజీలతో విద్యార్థులు ప్రయోగాలు చేసే సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్యాలను నేర్పించే ఐదు జాతీయ సంస్థలను (సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లను) నెలకొల్పుతారు. కృత్రిమమేధ (ఏఐ) రంగంలో విద్య కోసం రూ.500 కోట్లతో మరో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తారు. పాఠశాల, ఉన్నతవిద్యకు సంబంధించిన డిజిటల్‌ పుస్తకాలను స్థానిక భాషల్లో అందించటం కోసం ‘భారతీయ భాషా పుస్తక్‌’ పథకాన్ని తీసుకురానున్నారు.‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, ఎడ్యుకేషన్‌, రీసెర్చ్‌’కు కేటాయింపులను రూ.1000 కోట్ల నుంచి రూ.475 కోట్లకు తగ్గించారు.



Budget 2025: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం.. ముఖ్యాంశాలు ఇవే

Artificial Intelligence: బడ్జెట్‌లో AIకి ప్రాధాన్యత.. రూ. 500 కోట్ల కేటాయింపు..

Union Budget For Start-Ups: బడ్జెట్‌లో స్టార్టప్‌లకు సూపర్ న్యూస్.. లక్షల వర్షం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 02 , 2025 | 04:34 AM