Share News

India Migration Act 2025: 16వేల మంది విదేశీయులను తిప్పి పంపించే యోచన

ABN , Publish Date - Sep 17 , 2025 | 06:52 AM

దేశంలోకి అక్రమంగా వచ్చిన 16వేల మంది విదేశీయులను తిప్పి పంపించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. అక్రమంగా రావడంతో పాటు, నేరాలు చేసినందుకు వారు ప్రస్తుతం దేశంలోని...

India Migration Act 2025: 16వేల మంది విదేశీయులను తిప్పి పంపించే యోచన

  • అక్రమంగా వచ్చినట్టు కేంద్రం గుర్తింపు

  • నూతన చట్టం కింద చర్యలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: దేశంలోకి అక్రమంగా వచ్చిన 16వేల మంది విదేశీయులను తిప్పి పంపించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. అక్రమంగా రావడంతో పాటు, నేరాలు చేసినందుకు వారు ప్రస్తుతం దేశంలోని పలు చోట్ల నిర్బంధంలో ఉన్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ‘వలసలు, విదేశీయుల చట్టం-2025’ ప్రకారం వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వీరిలో చాలా మందికి మాదక ద్రవ్యాల సరఫరా, క్రిమినల్‌ చర్యలతో సంబంధం ఉండడంతో వారిని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బోర్డు (ఎన్‌సీబీ) అదుపులోకి తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వారిని తిప్పిపంపించే విధానాలను ఖరారు చేసే పనిలో కేంద్ర హోం శాఖ ఉన్నట్టు సమాచారం. ఈ నెల రెండో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన నూతన చట్టం ప్రకారం దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారిపై కఠిన చర్యలు ఉంటాయి. తప్పుడు పత్రాలతో అక్రమంగా వచ్చేవారికి 2 నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష ఉంటుంది. రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా కూడా విఽధిస్తారు. వారి స్వదేశాలకు తిప్పి పంపిస్తారు. వారిని స్వదేశాలకు తిప్పి పంపించే విషయమై కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తోంది. అక్రమంగా వలస వస్తున్నవారి కారణంగా తలెత్తుతున్న వ్యవస్థీకృత నేరాలను అరికట్టేందుకు అనుసరించే దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా తొలుత వలసదార్లను తిప్పిపంపనుంది. తొలుత ఇప్పటికే నిర్బంధంలో ఉన్నవారిని పంపించే అవకాశం ఉందని తెలిపింది. అక్రమంగా వలస వచ్చిన వారు ప్రభుత్వ పథకాలను కూడా పొందుతుండడంతో నిజమైన పేదలకు అన్యాయం జరుగుతున్నట్టు అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ఇవి కూాడా చదవండి..

సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు

డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 06:58 AM