Canal Accident: యూపీలో కాలువలోకి కారు.. 11 మంది మృతి
ABN , Publish Date - Aug 04 , 2025 | 04:32 AM
ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. పృథ్వీనాథ్ ఆలయ దర్శనం కోసం
గోండా, ఆగస్టు 3: ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. పృథ్వీనాథ్ ఆలయ దర్శనం కోసం భక్తులతో బయలుదేరిన ఓ బొలేరో వాహనం అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందితో సహా పదకొండు మంది మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. పృథ్వీనాథ్ ఆలయానికి 15 మంది బొలేరో వాహనంలో బయలుదేరారు. మార్గం మధ్యలో కారు అదుపుతప్పి సరయు కాలువలో పడిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులు, రెస్క్యూ బృందాలతో కలిసి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారు. గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి