Share News

Car Falls Into Canal: అదుపుతప్పి కాలువలో పడిన కారు.. ఐదుగురు మృతి

ABN , Publish Date - Nov 26 , 2025 | 11:54 AM

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న కారు.. అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా.. ఒకరు గాయపడ్డారు.

 Car Falls Into Canal: అదుపుతప్పి కాలువలో పడిన కారు.. ఐదుగురు మృతి
Lucknow Kheri road accident

యూపీ‎, నవంబర్ 26: లఖింపూర్ ఖేరీలోని ధఖేర్వా-గిరిజాపురి జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. వేగంగా వస్తున్న కారు అకస్మాత్తుగా అదుపుతప్పి శారద కాలువ(car into canal)లో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం రాత్రి కారులో వివాహ వేడుక హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తుల సహాయంతో సహాయక బృందాలు ఆపరేషన్ చేపట్టి కాలువ నుంచి కారును బయటకు తీశారు. అప్పటికే ఐదుగురు ప్రయాణికులు మృతిచెందగా, గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం సీహెచ్‌సీ రామియా బెహ్రాద్ ఆసుపత్రికి తరలించారు.


ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం(UP CM condolences) వ్యక్తం చేస్తూ.. గాయపడిన వారికి తగిన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. అలాగే ఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను సీఎం యోగి ఆదేశించారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


స్పీడ్ బ్రేకర్(speed breaker accident)పై నుంచి కారు అతివేగంగా వెళ్లి.. నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి విషాద సంఘటనలను నివారించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిన్న(సోమవారం) కూడా యూపీలోని బంత్రా పోలీస్ స్టేషన్ ప్రాంతం సమీపంలో వాహనం ట్రక్కును ఢీకొట్టడంతో లక్నోలో జరిగిన బస్సు ప్రమాదంలో సుమారు 8 మంది గాయపడిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇవాళ పెరిగిన వెండి, బంగారం ధరలు

మావోయిస్టుల కస్టడీ పిటిషన్‌ వెనక్కి

Updated Date - Nov 26 , 2025 | 12:42 PM