Delhi Car Blast: ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక అంశాన్ని గుర్తించిన పోలీసులు
ABN , Publish Date - Nov 10 , 2025 | 09:16 PM
ఢిల్లీ పేలుడు ఘటన స్థలంలో తగలబడుతున్న కార్లలో CNG ట్యాంకులను పోలీసులు గుర్తించారు. ఈ ట్యాంకులను స్వాధీనం చేసుకుని, పరిశీలిస్తున్నారని సమాచారం. పేలుడు కారణాలను అన్వేషిస్తున్నట్లు ఢిల్లీ సీపీ తెలిపారు.
ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు( Delhi Car Blast) జరిగింది. ఎర్ర కోట సమీపంలో కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. డెడ్ బాడీలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. కారు పేలుడు ఘటన( Delhi Car Blast)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీస్తున్నారు. అమిత్ షా ఫోన్ ద్వారా ఘటనకు సంబంధించిన వివరాలను ప్రధానికి తెలియజేశారు. ఇదే సమయంలో పోలీసులు కీలక అంశాన్ని గుర్తించారు.
ప్రమాద స్థలంలో తగలబడుతున్న కార్లలో CNG ట్యాంకులను పోలీసులు గుర్తించారు. ఈ ట్యాంకులను స్వాధీనం చేసుకుని, పరిశీలిస్తున్నారని సమాచారం. పేలుడు(Delhi car blast) కారణాలను అన్వేషిస్తున్నట్లు ఢిల్లీ సీపీ తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేసి.. విచారిస్తున్నారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీమ్, ఎన్‌ఐఏ(NIA investigation) రంగంలోకి దిగాయి. ఇక భారీ పేలుడు ధాటికి ఘటనా స్థలంలో భీతావహ వాతావరణం నెలకొంది. ఈ పేలుడు ప్రభావంతో చుట్టుపక్కల ఉన్న పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయు. ఆరు కార్లు, రెండు ఈ-రిక్షాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాదం తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ సమీపంలో భారీగా ఆయుధాలు స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం..