అసలు దోషి అన్నే.. ఈ కేసులో సినిమాను మించిన ట్విస్టులు..!
ABN , Publish Date - Dec 17 , 2025 | 10:02 PM
వారిద్దరూ అన్నాదమ్ముళ్లు.. ఉన్నట్లుండి ఓ రోజు తన తమ్ముడు కనిపించడం లేదంటూ అన్నయ్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. తన తమ్ముడిని వెతికిపెట్టండి అంటూ పోలీసుల ఎదుట బోరున ఏడ్చాడు. ఆ తరువాత కూడా ప్రతి రోజూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తన తమ్ముడి ఆచూకీ దొరికిందా సార్ అంటూ..
వారిద్దరూ అన్నాదమ్ముళ్లు.. ఉన్నట్లుండి ఓ రోజు తన తమ్ముడు కనిపించడం లేదంటూ అన్నయ్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. తన తమ్ముడిని వెతికిపెట్టండి అంటూ పోలీసుల ఎదుట బోరున ఏడ్చాడు. ఆ తరువాత కూడా ప్రతి రోజూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తన తమ్ముడి ఆచూకీ దొరికిందా సార్ అంటూ వాకబు చేసేవాడు. దీంతో పోలీసులు సైతం ఈ కేసును మరింత సీరియస్‌గా తీసుకున్నారు. తమదైన శైలిలో ఎంక్వైరీ ప్రారంభించారు. విచారణలో అసలు మ్యాటర్ తెలిసి పోలీసులే ఖంగుతిన్నారు. తమ్ముడు కనిపించడం లేదంటూ కంప్లైంట్ ఇచ్చిన అన్నే.. అసలు నిందితుడు అని తేల్చారు పోలీసులు. మరి ఇంతకీ కనిపించకుండా పోయిన తమ్ముడికి ఏమైంది.. ఆ తమ్ముడిని అన్న ఏం చేశాడు.. వీరిద్దరి మధ్య అసలేం జరిగింది.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
శివమొగ్గ జిల్లాలోని సొరాబా తాలూకాలోని జెడికెరె గ్రామంలో మాలతేష్, రామచంద్ర(28) అన్నాదమ్ముళ్లు జీవనం సాగిస్తున్నారు. మాలతేష్‌కు వివాహం జరిగింది. రామచంద్ర ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఊళ్లోనే కూలిపని చేస్తున్నాడు. అయితే, రామచంద్ర తన అన్న భార్యతో అక్రమం సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం రామచంద్ర అన్న మాలతేష్‌కు తెలియగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ్ముడిని, భార్యను హెచ్చరించాడు. అదే సమయంలో రామచంద్రకు పెళ్లి చేయాలని నిర్ణయించాడు. కానీ, రామచంద్ర తన అన్న హెచ్చరికను ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఆమెతో సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. మరోవైపు రామచంద్రకు పెళ్లి అవ్వకపోవడానికి జాతకంలో దోషాలే కారణమని.. అతన్ని ఓ స్వామీజీ వద్దకు తీసుకెళ్తానంటూ మాలతేష్ చెప్పుకొచ్చాడు. ఇది నమ్మిన రామచంద్ర.. తన అన్నతో కలిసి వెళ్లాడు. అప్పటికే పక్కా ప్లాన్‌తో ఉన్న మాలతేష్.. తన స్నేహితుడు మంజునాథ్‌ని కూడా వెంట తీసుకెళ్లాడు. రామచంద్రను ఓ తోటలోకి తీసుకెళ్లి అక్కడ అతనితో బాగా మద్యం తాగించారు. ఆ తరువాత చేతులు, కాళ్లు కట్టేసి.. కుంకుమ, నిమ్మకాయ ఇచ్చి గొంతు కోసి చంపేశారు. ఆపై మృతదేహాన్ని తోటలోనే పాతిపెట్టారు.
తమ్ముడిని చంపిన మాలతేష్.. తనకేమీ తెలియదన్నట్లు నేరుగా సోరాబా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. తన తమ్ముడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. ఒక్క రోజు వెళ్లి ఊరుకుంటే అనుమానం వస్తుందని భావించిన మాలతేష్.. రోజూ పీఎస్‌కి వెళ్లి తన తమ్ముడి జాడ దొరికిందా లేదా అంటూ పోలీసులను ప్రశ్నించేవాడు. ఇలా 45 రోజులు గడిచిపోయింది.
అసలు రహస్యం బయటపడిందిలా..
తన కుమారుడు రామచంద్ర 45 రోజులుగా ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని తల్లి తీవ్ర ఆవేదనతో ఉండేది. అత్త బాధపటాన్ని చూడలేకపోయిన కోడలు.. అసలు విషయాన్ని చెప్పేసింది. రామచంద్రను మాలతేష్ చంపేశాడంటూ హత్య విషయాన్ని కోడలు భాగ్య తన అత్త గౌరమ్మకు చెప్పింది. దీంతో గౌరమ్మ.. తన పెద్ద కొడుకు మాలతేష్‌ను నిలదీసింది. రామచంద్ర ఎక్కడంటూ ప్రశ్నించింది. తల్లి ప్రశ్నకు స్పందించిన మాలతేష్.. ‘నన్ను ఏమీ అడగకు. అతని కథ ముగిసింది.’ అంటూ గట్టిగా అరుస్తూ చెప్పాడు. రామచంద్రను చంపి పాతిపెట్టిన ప్రదేశాన్ని తల్లి గౌరమ్మకు చూపించాడు మాలతేష్. హత్యా స్థలాన్ని చూసిన గౌరమ్మ.. ఆ తరువాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విషయాన్ని పోలీసులకు తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Also Read:
Dmitry Luchin: వెన్నుల్లో వణుకుపుట్టిస్తున్న హత్య.. చావే భయపడేలా..
Chandrababu Naidu: విద్యార్థులకు ఏం జరిగినా.. ముందు సస్పెండ్ చేస్తా: సీఎం వార్నింగ్