Chennai News: తాను మరణిస్తూ... ఆరుగురికి పునర్జన్మ
ABN , Publish Date - Aug 27 , 2025 | 10:29 AM
మెదడు నిర్జీవమైన బాలుడు తాను మరణిస్తూ ఆరుగురికి పునర్జన్మ ప్రసాదిం చాడు. తిరుప్పూర్ ముదలిపాళయం సిడ్కో వెల్లకరడు ప్రాంతానికి చెందిన ఎలిజబెత్ (38) భర్త వేలుస్వామి కొన్నేళ్ల క్రితం మృతిచెందగా, కుమారుడు ఇళంగో (15) కలసి ఉంటోంది.
చెన్నై: మెదడు నిర్జీవమైన బాలుడు తాను మరణిస్తూ ఆరుగురికి పునర్జన్మ ప్రసాదిం చాడు. తిరుప్పూర్ ముదలిపాళయం సిడ్కో వెల్లకరడు ప్రాంతానికి చెందిన ఎలిజబెత్ (38) భర్త వేలుస్వామి కొన్నేళ్ల క్రితం మృతిచెందగా, కుమారుడు ఇళంగో (15) కలసి ఉంటోంది. ఇళంగో 10వ తరగతి ఉత్తీర్ణుడై, ఇంట్లోనే ఉంటున్నాడు. ఇళంగో ఈ నెల 21వ తేది రాత్రి తన స్నేహితుడితో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, విజయాపురం-సిడ్కో రోడ్డు సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొన్నారు.
ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలైన ఇళంగోను తిరుప్పూర్ వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు, మెదడు నిర్జీవమైనట్లు నిర్ధారించారు. ఇళంగో అవయవాలు దానంగా ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. ప్రత్యేక శస్త్రచికిత్స ద్వారా అవయవాలను తొలగించిన వైద్యులు అంబులెన్స్‌లో కోయంబత్తూర్‌కు పంపారు. అక్కడి నుండి గుండె,
ఒక మూత్రపిండాన్ని చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రికి, కాలేయాన్ని కోయంబత్తూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి, ఒక మూత్రపిండాన్ని కోయంబత్తూర్ ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రికి, కళ్లు అరవింద్ కంటి ఆసుపత్రికి పంపారు. అవయవాలు దానం చేసి ఇళంగో మృతదేహానికి తిరుప్పూర్ ప్రభుత్వ వైద్యకళాశాల డీన్ మనోన్మణి, వైద్యులు, నర్సులు, వైద్య కోర్సులు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి ఉత్తమ్‌కు హరీష్ రావు సంచలన లేఖ
Read Latest Telangana News and National News