BMW Accident Delhi: ఆద్యంతం నిర్లక్ష్యమే
ABN , Publish Date - Sep 16 , 2025 | 06:20 AM
శరీరం గగుర్పొడిచే రీతిలో నిర్లక్ష్యంగానూ, వేగంగానూ బీఎండబ్ల్యూ కారు నడిపి వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తి తీరు అద్యంతం అనుమానాస్పదంగా మారింది. ఆదివారం ఢిల్లీలోని బంగ్లా సాహెబ్ ...
బైక్‌ను ఢీకొట్టిన బీఎండబ్ల్యూ కారు డ్రైవర్ తీరు
నిందితురాలి అరెస్టు..
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: శరీరం గగుర్పొడిచే రీతిలో నిర్లక్ష్యంగానూ, వేగంగానూ బీఎండబ్ల్యూ కారు నడిపి వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తి తీరు అద్యంతం అనుమానాస్పదంగా మారింది. ఆదివారం ఢిల్లీలోని బంగ్లా సాహెబ్ గురుద్వారాను దర్శించుకుని తిరిగి భార్య సందీప్ కౌర్‌తో కలిసి కేంద్ర ఆర్థికశాఖ డిప్యూటీ కార్యదర్శి నవ్‌జ్యోతి సింగ్ (52) వెళుతున్న మోటారు సైకిల్‌ను రింగురోడ్డు సమీప కంటోన్మెంట్ మెట్రో స్టేషన్ వద్ద వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. దీంతో నవ్‌జ్యోతి సింగ్ (52) తలకు తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోగా, భార్య సందీప్ కౌర్ గాయ పడ్డారు. ప్రమాద సమయంలో గగన్ ప్రీత్ కౌర్ అనే మహిళ డ్రైవింగ్ చేస్తున్నారు. తర్వాత ఆమె క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినా పలు పొరపాట్లు చేశారు. అక్కడికి 4 కి.మీ విస్తీర్ణంలో 11 కార్పొరేట్ ఆస్పత్రులున్నా.. కాదని 20 కి.మీ. దూరంలోని న్యూలైఫ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నవ్‌జ్యోతి సింగ్ మృతి చెందాడని ఆ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శకుంతలా కుమార్ తెలిపారు. ప్రమాదం మధ్యాహ్నం 1.30 గంటలకు జరిగితే ఆస్పత్రికెళ్లడానికి అర్థగంట పట్టింది. ఘటనాస్థలానికి దగ్గర్లోని ఎయిమ్స్, రామ్ మనోహర్ లోహియా, ఆర్మీ ఆస్పత్రులకు తీసుకెళ్లినా వైద్యులు ప్రాణాలు కాపాడేవారని మృతుడి బంధువు శైలేంద్ర, కొడుకు నవ్‌నూర్ సింగ్ వాపోయారు. సదరు న్యూలైఫ్ ఆస్పత్రి చాలా చిన్నదని నవ్‌నూర్ సింగ్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News