Share News

Chennai News: శ్రీరాముడి వేషధారణలో పోస్టర్లు

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:53 AM

హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రమూర్తితో తనను పోల్చవద్దంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి అమిత్‌షా తిరునల్వేలి పర్యటన సందర్భంగా శ్రీరాముడి వేషధారణతో తన ఫొటోలున్న పోస్టర్లను అతికించడమే కాకుండా ఆ రూపంతో ఉన్న జెండాలు కూడా కార్యకర్తలు ఎగురవేయడంపై తాను తీవ్ర ఆవేదన చెందానని ఓ ప్రకటనలో తెలిపారు.

Chennai News: శ్రీరాముడి వేషధారణలో పోస్టర్లు

- పార్టీ శ్రేణులపై నయినార్‌ ఆగ్రహం

చెన్నై: హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రమూర్తితో తనను పోల్చవద్దంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌(BJP state president Nainar Nagendran) పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి అమిత్‌షా(Union Minister Amit Shah) తిరునల్వేలి పర్యటన సందర్భంగా శ్రీరాముడి వేషధారణతో తన ఫొటోలున్న పోస్టర్లను అతికించడమే కాకుండా ఆ రూపంతో ఉన్న జెండాలు కూడా కార్యకర్తలు ఎగురవేయడంపై తాను తీవ్ర ఆవేదన చెందానని ఓ ప్రకటనలో తెలిపారు.


nani4.jpg

దైవ శక్తిని మానవ శక్తితో పోల్చకూడదని, అవతారపురుషుడితో తనను పోల్చేలా ఇలాంటి పోస్టర్లు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇకపై తనను దేవుళ్లతో పోల్చకూడదని, తనను దేవుడి రూపాలలో పోస్టర్లు ముద్రించకూడదని ఆయన పార్టీ శ్రేణులకు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరల్లో పెరుగుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 24 , 2025 | 11:53 AM