Share News

BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. వచ్చే ఏడాది కోటలో జెండా ఎగురవేసేది మేమే

ABN , Publish Date - Aug 16 , 2025 | 11:01 AM

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, సెయింట్‌ జార్జ్‌కోటలో జాతీయ జెండా తామే ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ధీమా వ్యక్తం చేశారు.

BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. వచ్చే ఏడాది కోటలో జెండా ఎగురవేసేది మేమే

చెన్నై: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, సెయింట్‌ జార్జ్‌కోటలో జాతీయ జెండా తామే ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌(BJP state president Nainar Nagendran) ధీమా వ్యక్తం చేశారు. టి.నగర్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం కమలాలయంలో స్వాతంత్య్ర దినం సందర్భంగా నయినార్‌ నాగేంద్రన్‌ జెండా ఎగురవేసి పార్టీ నేతలతో కలిసి జెండా వందనం చేశారు.


nani2.2.jpg

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ప్రపంచానికే ఆదర్శమన్నారు. రాష్ట్రంలో అధికారంలోవున్న డీఎంకే ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేలా పార్టీ కార్యకర్తలంతా ప్రతిన బూనాలని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వ వైఖరి గురించి ప్రచార రూపంలో ప్రజల వద్దకు తీసుకెళ్లాలని నాగేంద్రన్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్‌ నేతలు తమిళిసై సౌందరరాజన్‌, కరాటే త్యాగరాజన్‌, కరునాగరాజన్‌, మహిళా సభ్యులు, కార్యకర్తలు పాల్గొని జెండా వందనం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింతగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

త్వరలో ఖనిజ రంగంలోకి సింగరేణి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 16 , 2025 | 11:01 AM