BJP: పదవులపై ఉన్న శ్రద్ధ.. ప్రాజెక్టులపై లేదు
ABN , Publish Date - Aug 26 , 2025 | 02:41 PM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలపై, పదవులను కాపాడుకోవడంపై ఉన్న ఆసక్తి రైతులపై కానీ, ప్రాజెక్టులపై కానీ లేదని ప్రతిపక్షనాయకులు అశోక్ మండిపడ్డారు. సోమవారం తుంగభద్ర డ్యామ్‌ను బీజేపీ నాయకుల బృందం పరిశీలించింది.
- టీబీ డ్యాం భద్రత మరిచిన సిద్దరామయ్య ప్రభుత్వం
- ప్రతిపక్ష నాయకుడు అశోక్ మండిపాటు
బళ్లారి(బెంగళూరు): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలపై, పదవులను కాపాడుకోవడంపై ఉన్న ఆసక్తి రైతులపై కానీ, ప్రాజెక్టులపై కానీ లేదని ప్రతిపక్షనాయకులు అశోక్ మండిపడ్డారు. సోమవారం తుంగభద్ర డ్యామ్(Tungabhadra Dam)ను బీజేపీ నాయకుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా అశోక్(Ashok) మీడియాతో మాట్లాడుతూ సీఎం సిద్దరామయ్యకు పదవిని కాపాడుకునేందుకే సమయం సరిపోలేదని, రైతుల బాగోగులు మరిచే పోయారన్నారు.
దీనికి ప్రధాన ఉదాహరణ టీబీ డ్యాం పరిస్థితేనన్నారు. గతేడాది క్రస్ట్‌గేటు కొట్టుకుపోయి రైతులు ఎంతో ఆందోళనకు గురయ్యారని, ప్రబుత్వం అప్పుడు హడావుడి చేసిందే కానీ తర్వాత డ్యామ్ భద్రతపై దృస్టి పెట్టింది లేదన్నారు. ఎందరో రైతులకు జీవనాడి అయిన తుంగభద్రను విస్మరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని గేట్లను మార్చి డ్యామ్‌ను కాపాడాలన్నారు.

నవంబర్‌లో రాష్ట్ర రాజకీయాలు మారనున్నాయని, సీఎం దిగిపోవచ్చన్నారు. పదవులు కాపాడుకునేందుకు అధికార పార్టీ నాయకులు తాపత్రపడుతున్నారే కానీ తుంగభద్ర డ్యాం గురించి, రైతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. తుంగభద్ర డ్యాం భద్రతపై దృష్టి పెట్టకపోతే కర్నాటక, ఆంధ్ర రెండు రాష్ట్రాల రైతులూ నష్టపోక తప్పదన్నారు. ఇప్పటికి అధికారుల లెక్కల ప్రకారం 140 టీఎంసీల నీరు నదికి వెళ్లాయని, దీని వల్ల ఎవరికి నష్టం అని అన్నారు.
హిందూ దేవాలయాలపై కాంగ్రెస్ కుట్ర
ధర్మస్థల అంశంపై కాంగ్రెస్ వాళ్లు కావాలనే గొడవ సృష్టిస్తున్నారని, ఇది హిందూ దేవాలయాలపై కుట్రేనని ప్రతిపక్ష నేత అశోక్ అన్నారు. హోస్పేట్‌లో టీబీ డ్యాం పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూ దేవాలయాలే లక్ష్యంగా ఇటీవల సోషల్ మీడియాలో కథనాలు సృష్టిస్తున్నారన్నారు. దీని వెనుక పెద్ద ముఠా పనిచేస్తోందన్నారు. మాస్క్ మ్యాన్ అనన్యభట్ వీరంతా పాత్రధారులు. ప్రభుత్వం ముసుగు వేసుకున్న వ్యక్తి వెనుక ఉంది.
ప్రభుత్వమే అతనికి మద్దతు ఇస్తోందన్నారు. అనామకుడి మాట విని సిట్ ఏర్పాటు చేయడం దారుణమన్నారు. ముసుగు వేసుకున్న వ్యక్తిని ముసుగు తీయమని తాను గతంలో రెండుసార్లు చెప్పాను. అతను ముసుగు తీసేసి ఉంటే అతను దొంగ అని తెలిసి ఉండేది. అతను మతం మారిన వ్యక్తి అని తెలిసింది. గ్రామం మొత్తం ముసుగు వేసుకున్న వ్యక్తిని ప్రశ్నిస్తున్నారని అశోక్ అన్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరుతో రచ్చ చేస్తోందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..
Read Latest Telangana News and National News