Share News

Delhi Election Results: ఢిల్లీలో 64 వేల పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి భారీ విజయం

ABN , Publish Date - Feb 08 , 2025 | 06:33 PM

ఢిల్లీలోని బిజ్‌వాసన్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేత, మాజీ మంత్రి కైలాశ్ గెహ్లాట్ ఘన విజయం సాధించారు.

Delhi Election Results: ఢిల్లీలో 64 వేల పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి భారీ విజయం

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని బిజ్‌వాసన్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేత, మాజీ మంత్రి కైలాశ్ గెహ్లాట్ ఘన విజయం సాధించారు. 64,951 ఓట్లతో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గెలుపునకు ప్రధాని మోదీనే కారణమని స్పష్టం చేశారు. ‘‘ఈ విజయం ప్రధాని మోదీదే. ఆయన మార్గదర్శకత్వంలో ఈ ఎన్నికల్లో మేము గొప్ప విజయం సాధించాము’’ అని పేర్కొన్నారు (Kailash Gahlot).

Kejriwal Old Video: మోదీ ఈ జన్మలో తమను ఓడించలేరన్న కేజ్రీవాల్.. పాత వీడియో నెట్టింట వైరల్


ఆప్ ప్రభుత్వంలో రవాణా, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేసిన కైలాశ్ గెహ్లాట్ గతేడాది నవంబర్‌లో పార్టీకి రాజీనామా చేశారు. ఆప్‌లో వివాదాలతో పాటు ప్రజలకిచ్చిన హామీలను పార్టీ నెరవేర్చని కారణంగా తాను తప్పుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఆప్‌కు రాజీనామా చేసిన మరుసటి రోజే ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.

తన విజయం గురించి కైలాశ్ మాట్లాడుతూ.. అసత్యాల రాజకీయాలను ఢిల్లీ ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. ఆప్ పార్టీ, కేజ్రీవాల్‌‌కు ఇక ఎంత మాత్రం ప్రాముఖ్యత లేదని అన్నారు. అబద్ధాల రాజకీయాలు ఎంతో కాలం మనలేవని ఢిల్లీ ప్రజలు తాజా ఫలితాలతో రుజువు చేశారని వ్యాఖ్యానించారు.


Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

కాగా, 2008 నాటి నియోజకవర్గ పునర్విభజన సందర్భంగా బిజ్‌వాసన్ స్థానాన్ని ఏర్పాటు చేశారు. ధూల్‌సిరాస్, వసంత్ కుంజ్, మహీపాల్‌పూర్, రంగ్‌పురి, నాంగల్‌దేవాత్, బిజ్‌వాసన్, సమల్‌ఖా తదితర ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. 2020 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి భూపీందర్ సింగ్ జూన్ బీజేపీ అభ్యర్థి సత్‌ ప్రకాశ్ రాణాపై గెలుపొందారు. అంతకుమునుపు, 2015 నాటి ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి దేవీందర్ సెహ్రావత్ బీజేపీకి చెందిన సత్ ప్రకాశ్‌పై 20 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 08 , 2025 | 06:33 PM