BJP: కరూర్ ఘటనపై నివేదిక వెల్లడించండి
ABN , Publish Date - Oct 04 , 2025 | 01:06 PM
కరూర్‌లో తమిళ గ వెట్రి కళగం (టీవీకే) రాజకీయ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటపై పూర్తిస్థాయి నివేదికను బహిర్గతం చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ఎంపీల నిజనిర్ధారణ కమిటీ విజ్ఞప్తి చేసింది.
- సీఎంకు బీజేపీ నిజ నిర్ధారణ కమిటీ లేఖ
చెన్నై: కరూర్‌లో తమిళ గ వెట్రి కళగం (టీవీకే) రాజకీయ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటపై పూర్తిస్థాయి నివేదికను బహిర్గతం చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin)కు భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ఎంపీల నిజనిర్ధారణ కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ కమిటీ సీఎంకు శుక్రవారం లేఖ రాసింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ గత శనివారం కరూర్‌లో చేపట్టిన రోడ్‌షోలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందగా, మరో 110 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కరూర్ ఘటనపై పరిశీలించి నివేదిక ఇవ్వాలని కేంద్రమాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో ఎంపీల బృందాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. ఎంపీలు హేమమాలిని, తేజశ్వి సూర్య, బ్రిడ్జ్‌లాల్, శ్రీకాంత్ షిండే (శివసేన), అపరాజిత సారంగి, రేఖాశర్మ, పుట్టా మహేశ్‌కుమార్ (టీడీపీ)తో ఏర్పాటైన ప్రత్యేక బృందం కరూర్‌లో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చింది.
కరూర్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా ఈ ఎంపీల బృందం పరామర్శింంది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితర ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ కమిటీకి సారథ్య వహించిన ఎంపీ అనురాగ్ ఠాకూర్ సీఎం స్టాలిన్‌కు రాసిన లేఖలో వివరాలిలా ఉన్నాయి. ఎన్‌డీఏ కూటమి తరపున ఎనిమిది మంది ఎంపీల బృందం తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాలను కలుసుకున్నామని, ఈ దుర్ఘఘటనపై అన్ని వైపుల నుంచి సందేహాలు వస్తున్నాయన్నాని ఆ లేఖలో పేర్కొంది.
అయితే, ముఖ్యమంత్రిగా ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించడంతో పాటు ఈ విషాదకర ఘటనకు మూల కారణాలపై వెల్లడించేలా అధికారులను ఆదేశించాలని కోరింది. ‘‘కరూర్ దుర్ఘటనకు మూల కారణాలు ఏంటి? ఇంత భారీస్థాయిలో గుమిగూడటానికి కారణమేంటి? ఈ సమావేశం ప్రారంభంకావడానికి ముందు, వెనుక చేపట్టిన ముందస్తు చర్యలు ఏంటి? ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృత్తం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోదలచారు’’ అని లేఖలో పేర్కొంది. ఈ నివేదికను ప్రజలు కూడా తెలుసుకునేలా విడుదల చేయాలని కోరింది.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయ్ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం.. అనుకున్నదే జరిగింది
పెరిగిన ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు.. ఏ సేవకి ఎంత చెల్లించాలంటే
Read Latest Telangana News and National News