Share News

BJP: ఛత్తీస్‌గఢ్ ‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీ హవా

ABN , Publish Date - Feb 16 , 2025 | 05:32 AM

ఛత్తీస్‌గఢ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసిన కాషాయ పార్టీ తాజాగా 10 మున్సిపల్‌ కార్పొరేషన్లను సునాయాసంగా కైవసం చేసుకుంది.

BJP: ఛత్తీస్‌గఢ్ ‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీ హవా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఛత్తీస్‌గఢ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసిన కాషాయ పార్టీ తాజాగా 10 మున్సిపల్‌ కార్పొరేషన్లను సునాయాసంగా కైవసం చేసుకుంది. 10 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 49 మున్సిపల్‌ కౌన్సిల్‌, 114 నగర పంచాయతీలతో సహా 173 పట్టణ, స్థానిక సంస్థలకు ఫిబ్రవరి 11న పోలింగ్‌ నిర్వహించగా... శనివారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ మీడియాతో మాట్లాడుతూ... ఈ విజయం రాష్ట్ర బీజేపీ చరిత్రలో మరిచిపోలేని రోజుగా అభివర్ణించారు. కాగా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ 8 మున్సిపల్‌ కౌన్సిల్‌, 22 నగర పంచాయతీలను గెలుచుకుంది.

Updated Date - Feb 16 , 2025 | 05:32 AM