Share News

Bilawal Bhutto: ఉగ్రవాదులను అప్పగిస్తాం

ABN , Publish Date - Jul 06 , 2025 | 02:50 AM

భారత్‌ కోరుతున్న కొంతమంది ఉగ్రవాదులను అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పాకిస్థాన్‌ మాజీ విదేశాంగ మంత్రి, విపక్ష పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ పీపీపీ అధినేత బిలావల్‌ భుట్టో స్పష్టం చేశారు.

Bilawal Bhutto: ఉగ్రవాదులను అప్పగిస్తాం

ఇస్లామాబాద్‌, జూలై 5: భారత్‌ కోరుతున్న కొంతమంది ఉగ్రవాదులను అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పాకిస్థాన్‌ మాజీ విదేశాంగ మంత్రి, విపక్ష పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) అధినేత బిలావల్‌ భుట్టో స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో సహకరించేందుకు భారత్‌ సిద్ధపడితే, పరస్పర విశ్వాస కల్పన చర్యల్లో భాగంగా పాక్‌ అలాంటి చర్య చేపడుతుందన్నారు.


భారత్‌తో సత్సంబంధాల పునరుద్ధరణ కోసం లష్కరే తయిబా చీఫ్‌ హఫీజ్‌ సయిద్‌, జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌లను అప్పగిస్తారా అని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన ఆ విధంగా సమాధానం చెప్పినట్లు డాన్‌ పత్రిక వెల్లడించింది. మసూద్‌ అజార్‌, హఫీజ్‌ సయిద్‌ పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు. హఫీజ్‌ సయిద్‌ పాకిస్థాన్‌ కస్టడీలో ఉన్నాడని, మసూద్‌ అజార్‌ ఎక్కడున్నాడో తమకు తెలియదన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 02:50 AM