Bhojpuri singer Neha: భోజ్‌పురి గాయని.. నేహా సింగ్ రాథోడ్ సంచలన వ్యాఖ్యలు.. చివరికి..
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:01 PM
భారతదేశమే కాదా అని ఇష్టానికి తెగబడి మాట్లాడటం, కూర్చున్న చెట్టుకొమ్మనే నరుక్కుంటూ రాక్షసానందం పొందటం కుహానా వాదులకు కులాసాగా మారింది ఇండియాలో. నా దారి వేరే దారంటూ సిగ్గూ శరం లేకుండా మార్కెట్లోకి వస్తున్నారు.
Bhojpuri singer faces sedition charges: ప్రపంచ నేతలు, ప్రపంచ పౌరులు పహల్గాం దాడిని నిర్ద్వందంగా ఖండిస్తుంటే, భారత్ పౌరురాలు అయ్యుండి ఓ ప్రముఖ గాయని రెచ్చిపోయింది. భారత్ లో ఏం వాగినా చెల్లుతుందనుకుందో ఏమోగానీ పేట్రేగిపోయింది. తన ఇష్టానికి మాట్లాడింది. భద్రతా దళాలు లేకపోతే, అమాయకపు మనుషుల్ని మతాన్ని అడిగి మరీ చంపేస్తారా అనే కనీస ఆలోచన లేకుండా పిచ్చికూతలు కూసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు తాజాగా సంచలనంగా మారాయి.
26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న ఇటీవలి పహల్గామ్ ఉగ్రదాడి, ప్రభుత్వం, నిఘా, భద్రతా వైఫల్యమని పేర్కొంటూ పోస్టులు పెట్టింది భోజ్ పురి గాయని నేహా సింగ్ రాథోడ్. దేశానికి తమ వంతు అండగా ఉండాల్సి భారత పౌరురాలు, గాయని అయి ఉండీ నిస్సిగ్గుగా కేంద్ర ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసింది. సందట్లో సడేమియాలా మాటల దాడి చేస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టింది. పర్యవసానంగా ఈ భోజ్‌పురి గాయని నేహా సింగ్ రాథోడ్‌పై దేశద్రోహం అభియోగాలు నమోదయ్యాయి. మొత్తంగా పది కేసులు ఆమెపై నమోదు చేశారు.

పహల్గాం దాడి పేరుతో ప్రధాని మోడీ ఇప్పుడు బీహార్‌లో ఓట్లు అడుగుతారని ఆమె చేసిన వీడియోను పాకిస్తాన్ జర్నలిస్టుల బృందం నిర్వహిస్తున్న X హ్యాండిల్ తిరిగి పోస్ట్ చేయడం(షేర్)తో లక్నోలోని హజ్రత్‌గంజ్‌లో నేహాపై కేసు నమోదైంది. ఈ గాయని గతంలో కూడా ఇలాంటి సోషల్ మీడియా తప్పుడు మాటలు, తప్పుడు పోస్టులు చేసి వివాదాల్లో చిక్కుకుంది. అయినా ఈమెకు తెలిసిరాక, మళ్లీ దేశం మీద తెగబడింది. దేశస్తులందరిదీ ఒక దారైతే, నా దారి వేరేదంటూ మళ్లీ మొదటి కొచ్చి నడి రోడ్డులో నిల్చుంది. 
ఈ వార్తలు కూడా చదవండి..
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
మీ ఇంట్లో ఏపీ ఉందా.. అయితే ఈ జాగ్రర్తలు పాటించండి..
For More AP News and Telugu News