Womans body in suitcase: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం
ABN , Publish Date - May 21 , 2025 | 07:35 PM
బెంగళూరు నగర శివార్లలో చందాపుర ప్రాంతంలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఓ సూట్‌కేస్ అనుమానాస్పదంగా పడి ఉంది. ఆ సూట్‌కేస్‌లో ఓ మహిళ మృతదేహం ఉండడంతో అందరూ నివ్వెరపోయారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.

కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) నగర శివార్లలో బుధవారం ఉదయం అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నగర శివార్లలోని చందాపుర ప్రాంతంలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఓ సూట్‌కేస్ అనుమానాస్పదంగా పడి ఉంది. ఆ సూట్‌కేస్‌లో ఓ మహిళ మృతదేహం ఉండడంతో అందరూ నివ్వెరపోయారు (Womans body in suitcase). పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు (Crime News).
బెంగళూరు నగర శివార్లలోని అనేకల్ తాలూకా పరిధిలోని చందాపుర రైల్వే బ్రిడ్జ్ సమీపంలో బుధవారం ఉదయం ఓ సూట్‌కేసును స్థానికులు గుర్తించారు. రైల్వే ట్రాక్ పక్కన పడి ఉన్న ఆ సూట్‌కేస్ కాస్తా అనుమానాస్పదంగా ఉండడంతో వెంటనే స్థానిక సూర్యానగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సూట్‌కేసును తెరిచి చూడగా, అందులో ఓ మహిళ మృతదేహం ఉండటంతో వారు నివ్వెరపోయారు.
ఆ మహిళను వేరే ప్రాంతంలో హత్య చేసి ఆ మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి రైలు నుంచి ఇక్కడ విసిరేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అసలు ఆ మహిళ ఎవరు, ఆమెను హత్య చేసింది ఎవరని తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
CM Chandrababu Yoga Day: ప్రపంచానికి భారత్ అందిస్తున్న వరం యోగా
Vizianagaram Terror Suspects: ఉగ్రలింకుల కేసులో ఎన్‌ఐఏ దూకుడు
Read Latest National News And Telugu News