Woman Takes Life: పెద్దలు చేసిన తప్పు.. యువతికి శాపంగా మారి..
ABN , Publish Date - Dec 18 , 2025 | 08:00 AM
పెద్దలు తీసుకున్న నిర్ణయం ఓ యువతికి శాపంగా మారింది. పెద్దల తప్పు కారణంగా ఆ యువతి ప్రాణాలు తీసుకుంది. ప్రేమించిన వాడితో కాకుండా వేరే వాడితో పెళ్లి చేయడానికి ప్రయత్నించటంతో యువతి ఆత్మహత్య చేసుకుంది.
21వ శతాబ్ధంలోనూ ప్రేమకు పెద్దల అంగీకారం లభించటం లేదు. కులాలు, మతాలు ప్రేమికుల్ని వేరు చేస్తున్నాయి. పెద్దలు తీసుకున్న నిర్ణయం ఓ యువతికి శాపంగా మారింది. పెద్దల తప్పు కారణంగా ఆ యువతి ప్రాణాలు తీసుకుంది. ప్రేమించిన వాడితో కాకుండా వేరే వాడితో పెళ్లి చేయడానికి ప్రయత్నించటంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. రైలు కింద పడి చనిపోయింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బళ్లారి తాలూకా దమ్మూరు కగ్గళ్లు గ్రామానికి చెందిన పల్లవి అనే యువతి అదే గ్రామానికి చెంది ఓ యువకుడు ప్రేమించుకున్నారు.
తాజాగా, ఆ యువకుడు పల్లవి ఇంటికి వెళ్లాడు. ప్రేమ సంగతి వారికి చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఇందుకు పల్లవి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారు. ఈ విషయం తెలిసి పల్లవి చాలా అప్‌సెట్ అయింది. ప్రియుడిని పెళ్లి చేసుకోవటం కుదరని తేలటంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రాణాలు తీసుకోవటానికి నిశ్చయించుకుంది. ధార్వాడ్‌లో రైలుకింద పడి ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పల్లవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
సంఘటనా స్థలంలో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ దొరికింది. ఇంట్లో మరో సూసైడ్ నోట్ దొరికింది. ఆ నోట్‌లో ప్రేమించిన వాడికి పల్లవి క్షమాపణలు చెప్పింది. తమ వాళ్లు అతడితో కలిసి బతకడానికి ఒప్పుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ విషయం తనను చాలా బాధిస్తోందని అంది. ప్రేమ విఫలం కారణంగానే ప్రాణాలు తీసుకుంటున్నట్లు స్పష్టంగా సూసైడ్ నోట్లలో రాసుకొచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పల్లవి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువతి తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, ప్రియుడిని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
తొలి తెలుగు శాసనానికి అరుదైన గౌరవం
తిరుపతి, మచిలీపట్నం నుంచి.. నగరానికి ప్రత్యేక రైళ్లు