Share News

High Court: ఖైదీలతో సఖ్యతగా ఉండాలి..

ABN , Publish Date - Jan 29 , 2025 | 01:47 PM

రాష్ట్రవాప్తంగా ఉన్న జైళ్లలో ఉన్న ఖైదీల పట్ల దురుసుగా ప్రవర్తించకుండా, సఖ్యతగా ఉండాలని జైళ్ల శాఖకు మద్రాసు హైకోర్టు(Madras High Court) సలహా ఇచ్చింది. నైజీరియాకు చెందిన కింగ్స్‌లి తరుఫున హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో రాష్ట్రంలోని జైళ్లలో విదేశీ ఖైదీలకు కనీస వతులు కల్పించడం లేదని, ఖైదీలపట్ల అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

High Court: ఖైదీలతో సఖ్యతగా ఉండాలి..

- జైళ్ల శాఖకు మద్రాసు హైకోర్టు సలహా

చెన్నై: రాష్ట్రవాప్తంగా ఉన్న జైళ్లలో ఉన్న ఖైదీల పట్ల దురుసుగా ప్రవర్తించకుండా, సఖ్యతగా ఉండాలని జైళ్ల శాఖకు మద్రాసు హైకోర్టు(Madras High Court) సలహా ఇచ్చింది. నైజీరియాకు చెందిన కింగ్స్‌లి తరుఫున హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో రాష్ట్రంలోని జైళ్లలో విదేశీ ఖైదీలకు కనీస వతులు కల్పించడం లేదని, ఖైదీలపట్ల అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ పిటిషన్‌ హైకోర్టు న్యాయమూర్తు ఎస్‌ఎం.సుబ్రమణ్యం, ఎం.జ్యోతిరామన్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.

ఈ వార్తను కూడా చదవండి: Rajanikanth: చెన్నై చేరుకున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌..


విదేశీ ఖైదీల సంక్షేమానికి సంబంధించి నిబంధనలున్నాయా? అనే అంశంపై వివరించేందుకు రెండు వారాల అవకాశం కల్పించాలని కేంద్రప్రభుత్వ అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఏఆర్‌ సుందరేశన్‌ కోర్టును అభ్యర్ధించారు. విదేశీ ఖైదీలకు గత డిసెంబరు నుండి ఉదయం అల్పాహారాన్ని జైళ్లలో ఇవ్వడంలేదని పిటీషనర్‌ తరుఫు న్యాయవాది తెలిపారు.


ఇరు తరుఫు వాదనల అనంతరం హైకోర్టు ధర్మాసనం(High Court Bench) విదేశీ ఖైదీలు మాత్రమే కాకుండా జైళ్లలో శిక్ష అనుభవిస్త్ను ఖైదీలను కూడా మానవతా ధృక్పధంతో చూడాలని, వారికి కనీస వసతులను సమకూర్చాలని సూచించారు. ముఖ్యంగా విదేశీ ఖైదీలను చూసుకొనే విధానాన్ని బట్టి ఆయా దేశాల్లో భారతదేశానికి తగిన గౌరవం దక్కుతుందని సలహా ఇచ్చిన న్యాయమూర్తులు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy : పిచ్చోడు.. తిక్కలోడు

ఈవార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై

ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

ఈవార్తను కూడా చదవండి: TG News: ఛీ ఛీ అనిపించుకోను

Read Latest Telangana News and National News

Updated Date - Jan 29 , 2025 | 01:47 PM