Share News

Assembly Speaker Appavu: పూర్తి అధికారం పార్లమెంట్‌కే ఉంది.. ఈసీకి లేదు

ABN , Publish Date - Aug 12 , 2025 | 11:34 AM

కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిని అసెంబ్లీ స్పీకర్‌ అప్పావు తప్పుబట్టారు. పూర్తి అధికారం పార్లమెంట్‌కే ఉందని ఎన్నికల సంఘానికి లేదన్నారు. ఆయన తిరునెల్వేలిలో మీడియాతో మాట్లాడుతూ, ఒక వ్యక్తి ఆరోపణలు చేస్తే, అది అబద్ధమని నిరూపించకుండానే ఆ వ్యక్తిని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేయడం తప్పన్నారు.

Assembly Speaker Appavu: పూర్తి అధికారం పార్లమెంట్‌కే ఉంది.. ఈసీకి లేదు

- స్పీకర్‌ అప్పావు

చెన్నై: కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిని అసెంబ్లీ స్పీకర్‌ అప్పావు తప్పుబట్టారు. పూర్తి అధికారం పార్లమెంట్‌కే ఉందని ఎన్నికల సంఘానికి లేదన్నారు. ఆయన తిరునెల్వేలిలో మీడియాతో మాట్లాడుతూ, ఒక వ్యక్తి ఆరోపణలు చేస్తే, అది అబద్ధమని నిరూపించకుండానే ఆ వ్యక్తిని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేయడం తప్పన్నారు. ఇలాంటి చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం అండగా ఉండటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.


కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానంలో ఐఐటీ(IIT) వంటి పోటీ పరీక్షల్లో ఉన్నతశ్రేణి వర్గాలకు చెందిన విద్యార్థులు గురుకులాల్లో విద్యాభ్యాసం చేయడం వల్ల ఉన్నత చదువులకు వెళ్ళే పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు రూ.14 వేల కోట్ల రుణాలను రద్దు చేశారన్నారు. పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.


nani4.2.jpg

అదేసమయంలో త్రిభాషా విద్యా విధానానికి మన రాష్ట్రంలో చోటు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానంలో ఒక విద్యార్థి 3, 5, 8 తరగతుల్లో ఉత్తీర్ణులైతేనే పై చదువులకు వెళ్ళే పరిస్థితి ఉంటుందని లేనిపక్షంలో కూలి పనులు వెళ్ళాల్సి ఉంటుందని స్పీకర్‌ అప్పావు అభిప్రాయపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు.. కానీ వెండి మాత్రం..

చట్టాలు తెలుసుకుని అమెరికా రండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 12 , 2025 | 11:34 AM