Airline Staff Attack: అదనపు లగేజీ విషయంలో గొడవ..
ABN , Publish Date - Aug 04 , 2025 | 04:23 AM
స్పైస్‌జెట్ సిబ్బందిపై ఓ సైనికాధికారి దాడి చేసిన ఘటన శ్రీనగర్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
స్పైస్‌జెట్ సిబ్బందిపై సైనికాధికారి దాడి
శ్రీనగర్, ఆగస్టు 3: స్పైస్‌జెట్ సిబ్బందిపై ఓ సైనికాధికారి దాడి చేసిన ఘటన శ్రీనగర్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అదనపు లగేజీ విషయమై జరిగిన వివాదం కాస్తా ముదరడంతో ఆర్మీ అధికారి విమానయాన సిబ్బంది నలుగురిపై దాడి చేశారు. జులై 26న జరిగిన ఈ ఘటనలో ఓ ఉద్యోగికి వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఈ మేరకు స్పైస్‌జెట్ సంస్థ ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించింది. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణించేందుకు ఆర్మీ అధికారి రితేశ్‌కుమార్ సింగ్ 16 కిలోల లగేజీతో వచ్చినట్లు తెలిపింది. అయితే, 7 కిలోల వరకే ఉచితమని, మిగిలిన లగేజీకి రుసుము చెల్లించాలని సిబ్బంది కోరారు. తిరస్కరించిన ఆయన.. బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేయకుండానే బలవంతంగా ఏరోబ్రిడ్జి వద్దకు వెళ్లారు. సీఐఎ్‌సఎఫ్ సిబ్బంది ఆయన్ను వెనక్కి తీసుకొచ్చారు. అక్కడికి వచ్చిన ఆయన స్పైస్‌జెట్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడిగుద్దులు గుద్దడంతో పాటు, కింద పడిన ఓ ఉద్యోగిని బలంగా తన్నారు. దీంతో అతని వెన్నెముకలో ఎముక విరిగింది. అలాగే ఓ బోర్డు తీసుకొని బలంగా కొట్టారు. మరో ఉద్యోగి దవడకు తీవ్ర గాయమైంది. ఇంకొకరికి ముక్కులో నుంచి రక్తం వచ్చింది. తీవ్రగాయాలైన ఉద్యోగులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యవహారంలో ఆర్మీ అధికారిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి